భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు వియత్నాం దిగ్గజం ‘విన్‌ఫాస్ట్’ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది! అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడళ్లను నేరుగా భారత్‌కు తీసుకొచ్చి విక్రయించే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టడం ఇందుకు కారణం. మన దేశ వినియోగదారుల అభిరుచులు, మధ్యతరగతి ప్రజ జేబుపై భారం పడకుండా బడ్జెట్‌కు తగినట్లుగా ప్రత్యేకంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి విన్‌ఫాస్ట్ సన్నాహాలు ప్రారంభించింది.
గ్లోబల్ మోడళ్లకు బ్రేక్.. భారత్ కోసం వీఎఫ్ ఎక్స్, వీఎఫై వై!

ఈ ఎలక్ట్రిక్ కార్లను సంస్థ అంతర్గతంగా 'వీఎఫ్ ఎక్స్', 'వీఎఫ్ వై' అనే కోడ్ పేర్లతో పిలుస్తోంది. నిజానికి గతంలో తమ గ్లోబల్ మోడళ్లైన వీఎఫ్ 3, వీఎఫ్ 6, వీఎఫ్ 7 కార్లను భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ భావించింది. అయితే, ఇక్కడి మార్కెట్‌కు తగ్గట్లు తక్కువ ధరకు వాటిని అందించడం వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారింది. దీనితో ఆ తయారీ ప్రణాళికను నిలిపివేసింది. ప్రస్తుతం వీఎఫ్ 6, వీఎఫ్ 7 కార్లను 'కంప్లీట్లీ నాక్డ్-డౌన్' కిట్ల రూపంలో దిగుమతి చేసుకుని ఇక్కడే అసెంబుల్ చేయాలని నిర్ణయించింది.
రూ.10 లక్షలలోపే బడ్జెట్ ఈవీ 'వీఎఫ్ ఎక్స్'!
రాబోయే మోడళ్లలో 'వీఎఫ్ ఎక్స్' కారుపై ఆటోమొబైల్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది పరిమాణంలో చిన్నదైన వీఎఫ్ 3 కంటే పెద్దదిగా, వీఎఫ్ 6 కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. భారతీయ కుటుంబాలకు సరిపోయేంత విశాలమైన క్యాబిన్ ఇస్తూనే, తయారీ ఖర్చు పెరగకుండా చూసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కారు ధరను దాదాపు రూ. 10 లక్షల లోపే ఉండేలా విన్‌ఫాస్ట్ ప్రణాళికలు రచిస్తోంది.
భారత్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్ (టియాగో ఈవీ, పంచ్ ఈవీ) సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి పోటీగా మహీంద్రా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ కూడా సరికొత్త ఈవీలతో మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో రూ. 10 లక్షలలోపు ధరకే స్పేసియస్ ఎలక్ట్రిక్ కారును అందిస్తే విన్‌ఫాస్ట్‌కు భారత ఆటోమొబైల్ మార్కెట్ ఒక సువర్ణావకాశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
300కు పైగా భారతీయ సంస్థలతో భాగస్వామ్యం!
{{/usCountry}}భారత్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్ (టియాగో ఈవీ, పంచ్ ఈవీ) సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి పోటీగా మహీంద్రా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ కూడా సరికొత్త ఈవీలతో మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో రూ. 10 లక్షలలోపు ధరకే స్పేసియస్ ఎలక్ట్రిక్ కారును అందిస్తే విన్‌ఫాస్ట్‌కు భారత ఆటోమొబైల్ మార్కెట్ ఒక సువర్ణావకాశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
300కు పైగా భారతీయ సంస్థలతో భాగస్వామ్యం!
{{/usCountry}}రెండో మోడల్ అయిన 'వీఎఫ్ వై'కి సంబంధించిన సాంకేతిక వివరాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే, ఈ రెండు మోడళ్ల కోసం విన్‌ఫాస్ట్ ఇప్పటికే 300కు పైగా భారతీయ విడిభాగాల సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. కార్లను విదేశాల్లో డిజైన్ చేసి ఇక్కడ అసెంబుల్ చేయడం కాకుండా, ప్రారంభ దశ నుంచే భారతీయ విడిభాగాలను వాడటం ద్వారా తయారీ వ్యయాన్ని భారీగా తగ్గించాలని చూస్తోంది.
కంపెనీ భారత్‌లో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 19,100 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన తయారీ కేంద్రం రెండో దశ విస్తరణకు కూడా అనుమతులు లభించాయి. దక్షిణ భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రారంభ సామర్థ్యం ఏడాదికి 50,000 వాహనాలు కాగా, దీనిని 1,50,000 యూనిట్లకు విస్తరించే అవకాశం ఉంది. స్థానికంగా విడిభాగాలు కొనుగోలు చేస్తూ, తూత్తుకుడిలో ఉత్పత్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లను అందించవచ్చని విన్‌ఫాస్ట్ భావిస్తోంది.