...
...
Next Story

కోహ్లి మెరుపు షాట్.. ఆశ్చర్యంలో రిషబ్ పంత్.. రియాక్షన్ వైరల్.. నెట్స్ లో ఏం జరిగిందంటే?

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు నెట్స్ సెషన్‌లో విరాట్ కోహ్లీ దూకుడును చూసి రిషబ్ పంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "భాయ్ జీ, అచా బాల్ థా యే. టగ్డా మార్ దియ" అంటూ పంత్ రియాక్టయ్యాడు. ఇది వైరల్ గా మారింది.

Published on: Nov 29, 2025, 19:01:11 IST
Advertisement

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆదివారం (నవంబర్ 30) రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి వన్డేలో బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ, తమ సన్నద్ధతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. మిగతా భారత జట్టు కంటే ముందే తొలి వన్డే వేదికకు చేరుకున్న ఈ జోడీ, అవసరమైన మేరకు సాధన చేయడానికి సమయం తీసుకుంది.

కోహ్లి మెరుపు షాట్

ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు (PTI)
ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు (PTI)

శనివారం (నవంబర్ 29) నెట్ సెషన్ లో అర్ష్‌దీప్ సింగ్‌ బౌలింగ్ లో మెరుపు షాట్లు కొట్టాడు కోహ్లి. ఎడమచేతి వాటం పేసర్‌ను కోహ్లి మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అర్ష్‌దీప్ బంతిని షార్ట్ సైడ్‌లో వేయగా, 37 ఏళ్ల కోహ్లీ అద్భుతమైన ఏరియల్ షాట్‌ కొట్టాడు. ఆ షాట్‌ను చూసి వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఆశ్చర్యపోయాడు. "భాయ్ జీ, అచా బాల్ థా యే. టగ్డా మార్ దియా (భాయ్ అది మంచి బంతి. అద్భుతమైన షాట్)’’ అని అని స్టంప్స్ వెనుక నుండి పంత్ అన్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

రోకో జోడీ

నెట్ సెషన్‌లో రోహిత్, కోహ్లి ప్రాక్టీస్ చేయడంతో పాటు మిగతా టీమ్ మేట్స్ తో సరదాగా గడిపారు. శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, తనతో పాటు ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్న యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘంగా సంభాషిస్తూ కనిపించాడు రోహిత్. మరోవైపు కోహ్లీ కూడా ఉల్లాసంగా ఉంటూ పంత్, అర్ష్‌దీప్‌లతో సరదాగా గడిపాడు. ఆదివారం ఇండియా, సౌతాఫ్రికా మధ్య రాంచీలో ఫస్ట్ వన్డే జరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks