విరాట్ కోహ్లి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ తనలో పరుగుల వేగం తగ్గలేదు. ఆటపై కసి తీరలేదేని మరోసారి స్పష్టం చేశాడు. ఈ రికార్డుల వివరాలపై ఓ లుక్కేయండి.
విరాట్ కోహ్లి రికార్డు

పరుగుల రారాజు, రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28 వేల పరుగులు కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు కింగ్ కోహ్లి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్. ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లి ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్ లో 13వ ఓవర్లో విరాట్ ఈ ఘనత సాధించాడు.
624 ఇన్నింగ్స్ ల్లో
విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించాడు. కేవలం 624 ఇన్నింగ్స్ ల్లోనే విరాట్ కోహ్లి ఈ మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 644 ఇన్నింగ్స్ ల్లో 28 వేల పరుగులు చేశాడు.
మూడో బ్యాటర్
ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 28000 పరుగులు అందుకున్న క్రికెటర్లలో విరాట్ మూడో బ్యాటర్. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, శ్రీలంక లెెజెండరీ బ్యాటర్ కుమార సంగక్కర ముందున్నారు. కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు.
వరుసగా అయిదో ఫిఫ్టీ
వన్డేల్లో విరాట్ కోహ్లి ఫామ్ మామూలుగా లేదు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో విరాట్ కు ఇది వరుసగా అయిదో ఫిఫ్టీ. 44 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.
{{/usCountry}}వన్డేల్లో విరాట్ కోహ్లి ఫామ్ మామూలుగా లేదు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో విరాట్ కు ఇది వరుసగా అయిదో ఫిఫ్టీ. 44 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.
{{/usCountry}}ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెకండ్ ప్లేస్ కు చేరుకున్నాడు. కుమార్ సంగక్కర (594 మ్యాచ్ ల్లో 28016)ను కోహ్లి దాటేశాడు. సచిన్ (664 మ్యాచ్ ల్లో 34357 పరుగులు) టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న సచిన్ ను కోహ్లి అందుకోవడం కష్టమేనని చెప్పొచ్చు.