బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ లెక్కలేనన్ని వికెట్లను సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ శనివారం (డిసెంబర్ 6) వైజాగ్ లో అతనికి ఒక కొత్త డాన్స్ పార్టనర్ దొరికాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డేలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పెల్ పూర్తి చేసినప్పుడు, కోహ్లీ ఈ లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్-స్పిన్నర్ ను ఒక 'మాక్ స్లో-డాన్స్' లోకి లాగి, అతని చేతిని పట్టుకుని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
కోహ్లి డ్యాన్స్

గ్రౌండ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కోహ్లి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. ఆడియన్స్ కు బోర్ కొట్టనివ్వడు. శనివారం కూడా వైజాగ్ లో అదే చేశాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. చివర్లో ఒకే ఓవర్లో కార్బిన్ బాష్, ఎంగిడి వికెట్లు తీశాడు. అప్పుడు కోహ్లి వచ్చి కుల్‌దీప్‌ను హత్తుకుని, చేయి పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఈ బ్రోమాన్స్ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఎడమ చేతితో టాస్
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో ఇండియా రాత మారింది. వరుసగా 21 వన్డేల తర్వాత తొలిసారి భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తన స్టైల్ మార్చి ఎడమ చేత్తో టాస్ వేశాడు. ఇది ఇండియాకు కలిసొచ్చింది. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది.
డికాక్ సెంచరీ
{{/usCountry}}సౌతాఫ్రికాతో మూడో వన్డేలో ఇండియా రాత మారింది. వరుసగా 21 వన్డేల తర్వాత తొలిసారి భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తన స్టైల్ మార్చి ఎడమ చేత్తో టాస్ వేశాడు. ఇది ఇండియాకు కలిసొచ్చింది. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది.
డికాక్ సెంచరీ
{{/usCountry}}వైజాగ్ వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా మొదట్లో చెలరేగి ఆడింది. డికాక్ 89 బంతుల్లో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా 48 రన్స్ సాధించాడు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్ కు 113 పరుగులు జోడించారు. దీంతో సౌతాఫ్రికా 28 ఓవర్లలో 168/2, ఆపై 199/4తో 300 స్కోరు చేసేలా కనిపించింది.
ప్రసిద్ధ్, కుల్‌దీప్ అదుర్స్
భారత బౌలర్లు ప్రసిద్ధ్, కుల్‌దీప్ అదరగొట్టారు. చెరో నాలుగు వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా 300 స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. తన మొదటి రెండు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్.. తర్వాతి స్పెల్ లో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ను ప్రసిద్ధ్ 4/66 తో ముగించాడు.
కుల్‌దీప్ మిడిల్, లోయర్ ఆర్డర్ పని పట్టాడు. తన స్పిన్ తో వైజాగ్ లో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చాడు. కుల్‌దీప్ కూడా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివరకు సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.