ఇన్‌స్టాగ్రామ్‌లో Virat Kohli అకౌంట్ మాయం.. షాక్‌లో ఫ్యాన్స్! అసలేం జరిగింది?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ అకౌంట్ డిలీట్ అయ్యిందా? లేక ఇది డిజిటల్ డిటాక్సా? లేక టెక్నికల్ గ్లిచ్ ఆ? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు! ఈ ప్రముఖ సోషల్ మీడియా నుంచి విరాట్ కోహ్లీ అకౌంట్ మాయమైపోయింది. ఈ వ్యవహారంపై ఇంటర్నెట్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 270 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు. అతనొక గ్లోబల్ బ్రాండ్, నిత్యం మన కళ్లముందు ఉండే వ్యక్తి, చాలా మంది అభిమానుల రోజువారీ సోషల్ మీడియా అలవాటులో ఒక భాగం. కాబట్టి, కోహ్లీ ప్రొఫైల్‌లో "దిస్ పేజ్ ఈజ్ అన్అవైలబుల్" (ఈ పేజీ అందుబాటులో లేదు) అనే నిరుత్సాహకరమైన సందేశం కనిపించగానే, ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది.
విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాయమైనట్టు అభిమానులు ఎలా గుర్తించారు?
విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ శుక్రవారం తెల్లవారుజామున కనిపించకుండాపోయింది. రాత్రిపూట మేల్కొనేవారు, తెల్లవారుజామునే నిద్రలేచేవారు మొదట దీనిని గమనించి అప్రమత్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వరదలా వచ్చి చేరాయి. వాట్సాప్ గ్రూపులు ఈ వార్తతో మారుమోగిపోయాయి.
ప్రతిచోటా ఒకే ప్రశ్న వినిపించింది: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఏమైంది?
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. కోహ్లీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ఇంకో విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా సెర్చ్‌లో కనిపించడం లేదు.
తాజా పరిణామాల మధ్య ఫ్యాన్స్ ఇప్పుడు కోహ్లీ భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మను సంప్రదిస్తున్నారు. “వదిన.. అన్న అకౌంట్‌కి ఏమైంది?” అంటూ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అదృశ్యం అవ్వడంపై అనుష్క శర్మ స్పందించాల్సి ఉంది.
అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ ఒకరు. టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ వంటి ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ ఐకాన్స్ కూడా విరాట్‌ని అనుసరిస్తారు. బ్రాండ్లు కోహ్లీ పోస్టుల కోసం క్యూ కడుతుంటాయి. అభిమానులు కోహ్లీ అప్‌డేట్స్ కోసం వేచి చూస్తుంటారు,అతను పెట్టే ప్రతి ఫోటో హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాయి.
గత కొన్నేళ్లుగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రధానంగా రెండు విషయాల కోసం ఉపయోగించారు: ఒకటి బ్రాండ్ ప్రమోషన్లు, రెండవది తన భార్య, నటి అనుష్క శర్మ కోసం పెట్టే పోస్టులు. వివాహ వార్షికోత్సవ సందేశాల నుంచి నిశ్శబ్దమైన కుటుంబ క్షణాల వరకు, అభిమానులు కోహ్లీలోని సున్నితమైన కోణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసేవారు.
అయితే, విరాట్ కోహ్లీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ఇంకా యాక్టివ్‌గానే ఉంది, అందరికీ కనిపిస్తోంది.
తాజా పరిణామాల మధ్య.. కోహ్లీ సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకుంటున్నాడా? ఇది కేవలం డిజిటల్ డిటాక్సా? లేక చిన్న సాంకేతిక లోపాన్ని మనం ఇంతగా ఊహించుకుంటున్నామా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


