...
...
Next Story

Vivo S2 : 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్​ఫోన్- ఇండియాలో ‘ఎస్​2’ లాంచ్​ డేట్​ ఇదేనా?

Vivo s2 launch date in India : వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఆగస్టు 6న లాంచ్ కానున్నట్లు కొత్త లీకులు వెల్లడిస్తున్నాయి. 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్‌తో రానున్న ఈ ఫోన్ ధర, సేల్ తేదీలపై ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇక్కడ చూడండి.

Published on: Jul 26, 2026, 09:10:51 IST
Advertisement

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వివో’.. భారత మార్కెట్‌లోకి తమ కొత్త 'ఎస్' సిరీస్ ఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ‘వివో ఎస్2’ మోడల్ త్వరలోనే దేశీయంగా లాంచ్ కానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, ఫస్ట్ సేల్, దానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ పోస్టర్ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిబట్టి ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ఎంతో సమయం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

వివో ఎస్​2 ఇండియా లాంచ్ డేట్​ ఇదేనా?

వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ (Representative Image)
వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ (Representative Image)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఆగస్టు 6న విడుదల కానుంది. ఆ తర్వాత ఆగస్టు 11 నుంచి దీని సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు "Vivo S2: Flows Into Your Hands Soon" అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఒక ప్రమోషనల్ పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు.

గతంలో 2019లో వచ్చిన 'వివో ఎస్1' తర్వాత, భారత మార్కెట్‌లోకి 'ఎస్' సిరీస్ మళ్లీ రాబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

వివో ఎస్​2 వేరియంట్లు, కలర్ ఆప్షన్స్..

లీకైన నివేదికల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది:

  • 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్
  • 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్

అలాగే ఈ ఫోన్ సాఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్, సిల్క్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని సమాచారం.

వీవో ఎస్​2 ధర ఎంత ఉండొచ్చు?

ఇటీవల కొన్ని రిటైల్ లిస్టింగ్‌ల ఆధారంగా ఈ ఫోన్ డెమో యూనిట్ ధరలు రూ. 38,000, రూ. 42,000గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరో నివేదిక ప్రకారం, 8GB + 128GB మోడల్ ధర దాదాపు రూ. 43,000 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఇవి కేవలం లీక్స్​ సూచిస్తున్న ధరలు మాత్రమేనని, ఫోన్ వాస్తవ ప్రారంభ ధర వేరేలా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వివో ఎస్​2 ఫీచర్లు (అంచనా)..

డిస్‌ప్లే: 6.59-అంగుళాల 1.5కే ఓఎల్​ఈడీ డిస్‌ప్లే, 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రానుంది.

ప్రాసెసర్: ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ వాడినట్లు కొన్ని కథనాలు పేర్కొనగా, 91మొబైల్స్ నివేదిక ప్రకారం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

కెమెరా: వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మరియు 8-మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను అందించవచ్చు. అలాగే ఫ్రంట్, రేర్ కెమెరాల రెండింటి ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేసుకునే వెసులుబాటు ఉండనుందని సమాచారం.

బ్యాటరీ- ఛార్జింగ్: ఈ ఫోన్‌లో అత్యంత భారీగా 7,000ఎంఏహెచ్ బ్యాటరీని అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే, ఈ లాంచ్ టైమ్‌లైన్ లేదా ఫీచర్లపై వివో సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe