చైనా మార్కెట్లో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దాని పేరు వివో వై500 ప్రో. వివో వై సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై500 ప్రో- ధర వివరాలు (చైనా మార్కెట్లో)

వివో వై500 ప్రో స్మార్ట్‌ఫోన్ వివిధ వేరియంట్‌లలో లాంచ్ అయింది. చైనాలో దీని ధరలు, భారతీయ కరెన్సీలో అంచనా ధరలు (సుమారుగా) ఇలా ఉన్నాయి..
8GB + 128GB- 1,799 యువాన్ (రూ. 22,000)
8GB + 256GB- 1,999 యువాన్ (రూ. 25,000)
12GB + 256GB- 2,299 యువాన్ (రూ. 28,000)
12GB + 512GB- 2,599 యువాన్ (రూ. 32,000)
ఈ ఫోన్ ఆస్పిషియస్ క్లౌడ్, లైట్ గ్రీన్, సాఫ్ట్ పౌడర్, టైటానియం బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
వివో వై500 ప్రో- స్పెసిఫికేషన్లు..
ప్రాసెసర్- సాఫ్ట్‌వేర్: ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై నడుస్తుంది. ఇది ఆక్టా-కోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్ ఉన్నాయి.
ఈ వివో వై500 ప్రో ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ68+ఐపీ69 రేటింగ్ లభిస్తోంది.
డిస్‌ప్లే: వివో వై500 ప్రో 6.67-ఇంచ్ 1.5కే (1,260x2,800 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 94.10 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది.
కెమెరా:
{{/usCountry}}కెమెరా:
{{/usCountry}}రేర్ కెమెరా: ఇందులో డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ప్రధాన కెమెరా ఎఫ్/1.88 అపెర్చర్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ5 సెన్సార్ కాగా, దానికి తోడు ఎఫ్/2.4 అపెర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది.
ఫ్రెంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎఫ్/2.45 అపెర్చర్) ఉంది.
బ్యాటరీ- ఛార్జింగ్: ఈ హ్యాండ్‌సెట్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5G, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైడూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ, వైఫై, నావ్ఐసీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫోటోసెన్సిటివ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి.
బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఇది ఫేషియల్ రికగ్నిషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ వివో వై500 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్, ధరలపై క్లారిటీ రావాల్సి ఉంది. రానున్న రోజుల్లో సంస్థ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.