...
...
Next Story

Vivo Y6k : 6500ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్- వై6కే ఫీచర్లు, ధర..

ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వివో' తమ వై-సిరీస్‌లో ‘వివో వై6కే 5జీ’ ఫోన్‌ను విడుదల చేసింది. 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 120హెచ్​జెడ్ డిస్‌ప్లే, ఐపీ65 రేటింగ్‌తో వచ్చిన ఈ ఫోన్ వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 10, 2026, 05:33:40 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘వివో’.. బడ్జెట్ 5జీ విభాగాన్ని మరింత విస్తరిస్తూ తన వై-సిరీస్‌లో 'వివో వై6కే' అనే మోడల్‌ను లాంచ్ చేసింది. చైనా మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, గట్టితనానికి ప్రతీకగా ఐపీ65 రేటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

వివో వై6కే స్మార్ట్​ఫోన్..
వివో వై6కే స్మార్ట్​ఫోన్..

చైనాలో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

వివో వై6కే 5జీ ధర, లభ్యత వివరాలు..

వివో వై6కే స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. దీని ధరను 1,599 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 22,500) గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

వివో వై6కే పవర్‌ఫుల్ బ్యాటరీ, ఐదేళ్ల పనితీరు హామీ..

వివో వై6కే మోడల్‌లో ప్రధాన ఆకర్షణ ఇందులోని 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. దీనికి 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఈ బ్యాటరీ నిరంతరాయంగా ఐదేళ్ల పాటు తన పనితీరును సమర్థవంతంగా నిలబెట్టుకుంటుందని వివో సంస్థ స్పష్టం చేసింది.

"వినియోగదారులకు సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ అందిస్తూ, రోజువారీ అవసరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ మోడల్‌ను తీర్చిదిద్దాం," అని కంపెనీ వర్గాలు వెల్లడించారు.

వివో వై6కే- డిస్‌ప్లే, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఫీచర్లు..

ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ వివో వై6కే స్మార్ట్​ఫోన్​లో 6GB LPDDR4X ర్యామ్, 128జీబీ యూఎఫ్​ఎస్ 2.2 స్టోరేజ్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘ఆరిజిన్ ఓఎస్ 6’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

వివో వై6కే- కెమెరా, సెక్యూరిటీ, డ్యూరబులిటీ..

ఫోటోగ్రఫీ కోసం వివో వై6కే వెనుక వైపు f/2.2 ఎపర్చరు కలిగిన 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఐఆర్ బ్లాస్టర్​ని కూడా ఇందులో ఉంది. ఇక భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సదుపాయాలు ఉన్నాయి. నీరు, దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు ఐపీ65 రేటింగ్ ఇచ్చారు. ఫోన్ కింద పడినా తట్టుకునేలా 'ఎస్​జీఎస్ 5-స్టార్ డ్రాప్-రెసిస్టెన్స్' సర్టిఫికేషన్‌ కూడా పొందింది. ఈ ఫోన్ మందం 8.39 ఎంఎం కాగా, బరువు 209 గ్రాములు ఉంటుంది.

వివో ఈ ఏడాది చైనాలో ఇప్పటికే 7,200ఎంఏహెచ్ బ్యాటరీతో 'వివో వై6 5జీ' (స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2), ఏకంగా 9,000ఎంఏహెచ్ బ్యాటరీతో 'వివో వై600కే టర్బో' (స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4) వంటి మోడళ్లను విడుదల చేసింది. ఆ శ్రేణిలోనే ఇప్పుడు చవకైన ఆప్షన్‌గా ఈ కొత్త వై6కే నిలిచింది.

ఈ వివో వై6కే ఇండియా లాంచ్, ధర, ఫీచర్లపై సంస్థ ప్రకటించాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks