...
...
Next Story

Electric car : వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐ లాంచ్- సింగిల్ ఛార్జ్‌తో 424 కిలోమీటర్ల రేంజ్!

Volkswagen ID Polo GTI : జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తమ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ హాచ్‌బ్యాక్ ‘ID.Polo GTI’ ని గ్లోబల్ మార్కెట్​లో ఆవిష్కరించింది. 52-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 222.9 బీహెచ్​పీ పవర్, 424 కిలోమీటర్ల రేంజ్‌తో ఈ హాచ్‌బ్యాక్ కారు రూపొందింది.

Published on: May 17, 2026, 06:43:47 IST
Advertisement

Volkswagen ID Polo GTI range : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత పవర్‌ఫుల్‌గా విస్తరించింది. కంపెనీ చరిత్రలోనే ఎంతో ఐకానిక్ బ్రాండ్‌గా పేరుగాంచిన ‘జీటీఐ’ (గ్రాంట్​ టూరింగ్​ ఇంజెక్షన్) బ్యాడ్జ్‌ను మొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ కారుపై పరిచయం చేస్తూ ‘ID.Polo GTI’ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇటీవల మార్కెట్​లోకి వచ్చిన స్టాండర్డ్ ఐడీ.పోలో లోని 52-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే దీనికి ఉపయోగించినప్పటికీ.. దీని మోటార్‌ను మరింత శక్తివంతంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ సరికొత్త ఈవీ హాచ్‌బ్యాక్‌ని సాధారణ మోడల్ నుంచి వేరు చేయడానికి అగ్రెసివ్ ఎక్స్‌టీరియర్ మార్పులు, అడాప్టివ్ సస్పెన్షన్, ఫ్రంట్ లాకింగ్ డిఫరెన్షియల్, ప్రత్యేకమైన బ్లాక్-అండ్-రెడ్ ఇంటీరియర్ కలర్ థీమ్‌ను అందించారు.

పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ హాచ్‌బ్యాక్..
పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ హాచ్‌బ్యాక్..

వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐ- బ్యాటరీ, పవర్, రేంజ్..

ఈ కారులోని 52-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ముందు యాక్సిల్‌పై అమర్చిన పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 222.9 బీహెచ్​పీ పవర్, 229 ఎన్​ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ పోలో జీటీఐ కేవలం 6.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 175 కిలోమీటర్లుగా ఉంది.

స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఈ జీటీఐ వెర్షన్‌లో కస్టమర్లు 30 కిలోమీటర్ల రేంజ్‌ను కోల్పోవాల్సి వస్తుంది, కానీ దానికి బదులుగా 14.79 బీహెచ్​పీ అదనపు పవర్ లభిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 424 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్​టీపీ సర్టిఫైడ్) రేంజ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న 105-కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 24 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. గ్యాస్-పవర్డ్ గోల్ఫ్ జీటీఐ నుంచి సేకరించిన ఎలక్ట్రానికల్లీ లాకబుల్ ఫ్రంట్ డిఫరెన్షియల్, డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) అడాప్టివ్ డ్యాంపర్స్, ప్రత్యేకమైన ‘జీటీఐ డ్రైవింగ్ మోడ్’ ఈ కారు హ్యాండ్లింగ్‌ను, డ్రైవింగ్ డైనమిక్స్‌ను అద్భుతంగా మారుస్తాయి.

వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐ- ఎక్స్‌టీరియర్ డిజైన్..

ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ లోపల లగ్జరీ స్పోర్ట్స్ కార్ ఫీలింగ్ వచ్చేలా డార్క్ థీమ్‌ను ఉపయోగించారు. సీట్లు, డోర్ ప్యానెల్స్, స్టీరింగ్ వీల్‌పై రెడ్ కలర్ స్టిచ్చింగ్‌ను అందించారు. డ్యాష్‌బోర్డ్‌పై సిల్వర్ ట్రిమ్, క్యాబిన్ అంతటా జీటీఐ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఫీచర్ల పరంగా.. పెద్దదైన 12.9-ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రెట్రో-స్టైల్ గ్రాఫిక్స్‌తో కూడిన 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ప్రీమియం ఫీచర్లుగా వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి స్టాండర్డ్‌గా వస్తుండగా.. వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐలో అదనపు ఆప్షన్లుగా పనోరమిక్ గ్లాస్ రూఫ్, 10-స్పీకర్ల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్, మసాజ్ ఫంక్షన్ కలిగిన 12-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks