ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో ప్రాడక్ట్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే 2027లో లాంచ్ చేయనున్న తమ రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన తొలి టీజర్‌ను సంస్థ తాజాగా అధికారికంగా విడుదల చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ కారు కవర్‌తో కప్పి ఉండటంతో డిజైన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ కారు ముందు భాగం, వోక్స్‌వ్యాగన్ లోగో, అలాగే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ‘వోక్స్‌వ్యాగన్ టెరా’ హెడ్‌ల్యాంప్‌లను ఇది పోలి ఉండటం గమనించవచ్చు.

భారతదేశంలోని అత్యంత పోటీ ఉండే సబ్-4-మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వోక్స్‌వ్యాగన్ ఇటీవలే స్పష్టం చేసింది. పూర్తిగా స్థానికంగా తయారయ్యే ఈ కొత్త ఎస్‌యూవీని MQB-A0-IN ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందిస్తున్నారు.
పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా ప్రణాళిక!
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4-మీటర్ కేటగిరీలో ఈ వోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్‌యూవీ ప్రవేశించనుంది. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి దిగ్గజ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
గత కొంతకాలంగా వోక్స్‌వ్యాగన్ ఈ సెగ్మెంట్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. టైగూన్ కారును మాత్రం దీనికంటే పెద్ద సైజులో ఉంచింది. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త మోడల్ ద్వారా టైగూన్ కంటే చిన్నదిగా, సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఉండే సరికొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుంది. ఇది మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది.
MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత..
ఈ రాబోయే వోక్స్‌వ్యాగన్ ఎస్‌యూవీని పూర్తిగా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వోక్స్‌వ్యాగన్ టైగూన్, వర్టూస్తో పాటు స్కోడా కుషాక్, స్లావియా, కైలాక్ కార్లు ఇదే ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకున్నాయి.
ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విడిభాగాలను పరస్పరం పంచుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్ల తయారీ ఖర్చులు తగ్గడంతో పాటు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, బిల్డ్ క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ అందించడంలో ఫోక్స్‌వ్యాగన్ తన మార్కును నిలబెట్టుకోనుంది. పోలో హ్యాచ్‌బ్యాక్ నిలిచిపోయిన తర్వాత ఈ సెగ్మెంట్లో వోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న అతిపెద్ద లాంచ్ ఇదే కావడం విశేషం.
వోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్‌యూవీ- శక్తివంతమైన ఇంజిన్!
{{/usCountry}}ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విడిభాగాలను పరస్పరం పంచుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్ల తయారీ ఖర్చులు తగ్గడంతో పాటు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, బిల్డ్ క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ అందించడంలో ఫోక్స్‌వ్యాగన్ తన మార్కును నిలబెట్టుకోనుంది. పోలో హ్యాచ్‌బ్యాక్ నిలిచిపోయిన తర్వాత ఈ సెగ్మెంట్లో వోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న అతిపెద్ద లాంచ్ ఇదే కావడం విశేషం.
వోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్‌యూవీ- శక్తివంతమైన ఇంజిన్!
{{/usCountry}}ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన యాంత్రిక వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. మార్కెట్లో లభించే సమాచారం ప్రకారం ఇందులో బ్రాండ్‌కు చెందిన సుపరిచితమైన 1.0-లీటర్ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. స్కోడా కైలాక్ మోడల్‌లో ఇదే ఇంజిన్ సుమారు 115 పీఎస్ పవర్‌ని, 178 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ.. మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తోంది. అదే ఫార్ములాను వోక్స్‌వ్యాగన్ కూడా అనుసరించే ఛాన్స్ ఉంది.
వోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్‌యూవీ- లాంచ్ ఎప్పుడు?
ఈ సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2027లో అధికారికంగా భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వోక్స్‌వ్యాగన్ ధృవీకరించింది. లాంచ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కారు పేరు, ధర, వేరియంట్లు, ఇతర ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ వస్తుంది.