లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన విపణిలో వోల్వో సరికొత్త విప్లవానికి తెరతీసింది! తమ అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘వోల్వో ఈఎక్స్90’ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. పూర్తిగా ఫీచర్లతో నిండిన 'అల్ట్రా' వేరియంట్‌లో, కేవలం 6-సీటర్ లేఅవుట్‌తో మాత్రమే రూ. 1.26 కోట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు ఈ కారును తీసుకొచ్చారు! ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న ఐసీఈ వర్షెన్ ఎక్స్‌సీ90 కంటే రూ. 27.2 లక్షలు ఎక్కువ ధర ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, కొత్త ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ వాహనాన్ని ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక మైలురాయిగా కంపెనీ అభివర్ణిస్తోంది.
వోల్వో ఈఎక్స్90- డిసెంబర్ 31 వరకు ఆకర్షణీయ ఆఫర్లు!

భారతీయ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వోల్వో ప్రత్యేక ఇన్ట్రొడక్టరీ ప్యాకేజీని ప్రకటించింది. 2026 డిసెంబర్ 31లోగా ఈ ఎలక్ట్రిక్ కార్ బుక్ చేసుకునే వినియోగదారులకు 11కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్‌ను ఉచితంగా అందించడంతో పాటు, మూడేళ్ల సర్వీస్ ప్యాకేజీని ఇస్తున్నారు. అంతేకాకుండా, మూడేళ్ల తర్వాత వాహన విలువలో 65 శాతాన్ని తిరిగి ఇచ్చే బైబ్యాక్ హామీ పథకాన్ని కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
వోల్వో ఈఎక్స్90- 625 కిమీ రేంజ్!
సాంకేతిక పరంగా ఈ వాహనంలో 106కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి తోడుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిగిన ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు. ఇవి రెండూ కలిసి 456 హార్స్ పవర్, 670 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
స్పీడ్: కేవలం 5.5 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
గరిష్ట వేగం: గంటకు 180 కిలోమీటర్లు.
రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్‌టీపీ ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 625 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
800వీ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, 350కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 22 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుండి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ 11కేడబ్ల్యూ ఏసీ వాల్‌బాక్స్ ద్వారా పూర్తి ఛార్జింగ్‌కు 11 గంటల సమయం పడుతుంది.
వోల్వో ఈఎక్స్90- రాజసమైన డిజైన్, ఐకానిక్ హెడ్‌లాంప్స్..
స్వీడిష్ మినిమలిస్ట్ డిజైన్ శైలితో రూపొందిన ఈ ఎస్‌యూవీలో 'టీ-షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లను అమర్చారు. రోడ్డుపై మెరుగైన స్థిరత్వం కోసం 21-ఇంచుల అలాయ్ వీల్స్‌ను ప్రామాణికంగా ఇచ్చారు. ఈ వాహనం వీల్ బేస్ 2,985 ఎంఎం కాగా, సాధారణ గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఎంఎంగా ఉంటుంది. ఇందులోని ఎయిర్ సస్పెన్షన్ సహాయంతో గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఏకంగా 250 ఎంఎం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.
{{/usCountry}}స్వీడిష్ మినిమలిస్ట్ డిజైన్ శైలితో రూపొందిన ఈ ఎస్‌యూవీలో 'టీ-షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లను అమర్చారు. రోడ్డుపై మెరుగైన స్థిరత్వం కోసం 21-ఇంచుల అలాయ్ వీల్స్‌ను ప్రామాణికంగా ఇచ్చారు. ఈ వాహనం వీల్ బేస్ 2,985 ఎంఎం కాగా, సాధారణ గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఎంఎంగా ఉంటుంది. ఇందులోని ఎయిర్ సస్పెన్షన్ సహాయంతో గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఏకంగా 250 ఎంఎం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.
{{/usCountry}}క్రిస్టల్ వైట్, డెనిమ్ బ్లూ, మల్బెర్రీ రెడ్, ఆనిక్స్ బ్లాక్, శాండ్ డ్యూన్, వేపర్ గ్రే అనే ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ వాహనం లభిస్తుంది.
వోల్వో ఈఎక్స్90- ఇంటీరియర్, ప్రీమియం కంఫర్ట్..
వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ లోపల డ్యూయల్ టోన్ నాపా లెదర్ సీట్లు, బ్రష్డ్ అల్యూమినియమ్ ఫినిషింగ్‌తో అత్యంత విలాసవంతమైన వాతావరణం కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో 14.5 ఇంచుల నిలువు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం 9 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లేను ఇచ్చారు.
రెండో వరుసలో స్వతంత్ర క్యాప్టెన్ సీట్లను అమర్చారు. ట్రాన్స్‌పరెన్సీని మార్చుకునే సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, 25 స్పీకర్లతో కూడిన బోవర్స్ అండ్ విల్కిన్స్ ప్రసిద్ధ ఆడియో సిస్టమ్‌తో పాటూ 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్‌లను పొందుపరిచారు. తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అత్యాధునిక అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఈ కార్‌లో ఉంది.
వోల్వో ఈఎక్స్90- మార్కెట్లో గట్టి పోటీ
భారత మార్కెట్లో లగ్జరీ ఈ-ఎస్‌యూవీ విభాగంలో కియా ఈవీ9 (రూ. 1.30 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఎస్‌యూవీ (రూ. 1.49 కోట్లు) మోడళ్లకు వోల్వో ఈఎక్స్90 నేరుగా పోటీనివ్వనుంది. పోటీదారుల కంటే కాస్త తక్కువ ధరకే వోల్వో దీనిని అందుబాటులోకి తేవడం మార్కెట్లో కలిసొచ్చే అంశం.