యూకే యూనివర్సిటీల్లో చదవాలని ఉందా? ఈ స్కాలర్‌షిప్ వస్తే ఫీజు కట్టక్కర్లేదు.. వివరాలు మీకోసం!
యూకేలో చదవాలనుకుంటున్నారా? STEM స్కాలర్‌షిప్‌లు అందించనుంది బ్రిటిష్ కౌన్సిల్. దీనిద్వారా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో చదవాలనే మీ కోరిక నెరవేరనుంది.
బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)లో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్‌షిప్‌ల కోసం మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిద్వారా సైన్స్, ఆవిష్కరణలలో మహిళలకు అవకాశాలను పెంచడం, STEM రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్ చూస్తోంది. ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలు మాస్టర్స్ చేసేందుకు ఈ స్కౌలర్‌షిప్‌లు అందిస్తోంది.

ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా పూర్తిగా నిధులు సమకూరుతాయి. విద్యార్థులు హాయిగా చదువుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ ట్యూషన్ ఫీజులు, జీవన భృతి, ప్రయాణ మరియు వీసా ఖర్చులు, హెల్త్ కవరేజ్, ఆంగ్ల భాష సపోర్ట్ అందిస్తుంది. ప్రతి స్కాలర్‌షిప్ విలువ కనీసం 40,000 పౌండ్లు (సుమారు రూ. 36.16 లక్షలు). ఎంపిక చేసిన స్కాలర్‌షిప్‌లతో సైన్స్, పరిశోధనలో రాణించేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలలో చదువుతారు.
ఈ స్కాలర్‌షిప్స్ కేవలం ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం మాత్రమే కాదు.. దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఎంపికైన విద్యార్థులు STEMలో వృత్తిపరమైన అవకాశాలను బలోపేతం చేసుకోవచ్చు. అంతేకాదు పూర్వ విద్యార్థులతో కనెక్ట్ అయ్యేలా ప్లానింగ్ ఉంటుంది. దీనిద్వారా సబ్జెక్ట్‌తోపాటుగా అవకాశాల గురించి ఎప్పటికప్పుడు తెలుస్తుంది.
ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఏం పొందుతారు?
పూర్తి స్కాలర్‌షిప్స్: ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ప్రయాణ మరియు వీసా ఖర్చులు, హెల్త్ కవరేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సపోర్ట్ వంటివాటికి ఆర్థిక సహాయం పొందుతారు.
ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు: సైన్స్ అండ్ పరిశోధన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన యూకే సంస్థలలో చదువుకునే అవకాశాలు.
కెరీర్ అభివృద్ధి: STEM రంగంలో మహిళల కెరీర్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. వారి స్వదేశాలలో పరిశోధన, ఆవిష్కరణలకు దోహదపడటానికి సపోర్ట్ చేస్తుంది.
పూర్వ విద్యార్థులతో కనెక్ట్: యూకే పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లతో కనెక్ట్ అయి ఉంటారు. దీనిద్వారా అవకాశాలు గురించి తెలుస్తుంది.
విశ్వవిద్యాలయాల జాబితా
- ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం
- గ్లాస్గో విశ్వవిద్యాలయం
- మాంచెస్టర్ విశ్వవిద్యాలయం
- క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం లండన్
- బ్రూనెల్ విశ్వవిద్యాలయం లండన్
ఎక్కువ సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తుదారులు పాల్గొనే విశ్వవిద్యాలయాలు, అర్హత కలిగిన కోర్సుల జాబితా నుండి ఎంచుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిదానికీ ప్రత్యేక దరఖాస్తులు అవసరం. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియలు, గడువులు విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత, దరఖాస్తుదారులను వారి దరఖాస్తు స్టేటస్ గురించి సంబంధిత విశ్వవిద్యాలయాలు నేరుగా సంప్రదిస్తాయి.
దక్షిణాసియా నుంచి 25 మందికి
దక్షిణాసియా నుంచి 25 మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. 'STEM రంగంలో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్‌షిప్‌లు ఇండియా-యూకే విజన్ 2035 స్ఫూర్తి, ఆశయాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి. భారతదేశంలోని ప్రతిభావంతులైన మహిళలు యూకేలో ప్రపంచ స్థాయి STEM విద్యను పొందేందుకు వీలు కలుగుతుంది. సైన్స్, ఆవిష్కరణలలో లింగ అంతరాలను పరిష్కరిస్తున్నాం.' అని బ్రిటిష్ కౌన్సిల్‌లోని ఎడ్యుకేషన్ ఇండియా డైరెక్టర్ రిత్తికా చందా పరూక్ అన్నారు.
డౌట్స్ ఉండే అడగండి
ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం ఆరు సంవత్సరాల కిందట మెుదలైంది. ఇప్పటివరకు 43 యూకే విశ్వవిద్యాలయాలు ఇందులో భాగం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశాయి. కోర్సు సంబంధిత సందేహాల కోసం అభ్యర్థులు సంబంధిత విశ్వవిద్యాలయాలను సంప్రదించాలి. స్కాలర్‌షిప్ గురించి ప్రశ్నలను womeninstem.scholarships@britishcouncil.org బ్రిటిష్ కౌన్సిల్‌కు పంపవచ్చు.

E-Paper












