స్టాక్ మార్కెట్ దిగ్గజం, 'ఒమాహా మాంత్రికుడు' వారెన్ బఫెట్ ఇన్వెస్టర్లను మరోసారి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లు రికార్డు గరిష్టాల వద్ద ఊగిసలాడుతున్న తరుణంలో, ఇన్వెస్టింగ్ అనేది క్రమంగా జూదంగా మారిపోతోందని ఆయన విశ్లేషించారు. బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా మాట్లాడిన బఫెట్, మార్కెట్లో గూడుకట్టుకున్న 'అత్యాశ' (Greed) వల్ల అసెట్ ధరలు అర్థం లేని స్థాయికి చేరుతున్నాయని కుండబద్దలు కొట్టారు.
అత్యాశ, భయం.. రెండు ప్రమాదకరమైన అంటువ్యాధులు

వారెన్ బఫెట్ 1986లోనే తన ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో 'అత్యాశ', 'భయం' అనేవి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా మార్కెట్ అదే స్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు.
"ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం జూదపు మూడ్‌లో ఉన్నారు. మార్కెట్ గరిష్టాలకు చేరుతున్నప్పుడు అత్యాశ పెరిగి ధరలు అడ్డగోలుగా పెరుగుతాయి. అదే భయం ఆవహించినప్పుడు అసలు విలువ కంటే తక్కువకు పడిపోతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది కేవలం అతి తెలివైన జూదమే కానీ పెట్టుబడి కాదు" అని బఫెట్ సిఎన్‌బిసి (CNBC) ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బఫెట్ దృష్టిలో ఆ రెండు ప్రమాదకరమైన ధోరణులు
ముఖ్యంగా రెండు అంశాలపై బఫెట్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు:
వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్ (0DTE): ఈ కాంట్రాక్టులు ట్రేడింగ్ రోజునే ముగిసిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో ట్రేడర్లు దీనిపై ఎగబడుతున్నారు. దీనిని బఫెట్ 'పక్కా జూదం' అని కొట్టిపారేశారు. మన దేశంలో కూడా సెబీ (SEBI) గణాంకాలు చెబుతున్నట్లుగా.. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు. బఫెట్ వ్యాఖ్యలు భారతీయ యువ ట్రేడర్లకు ఒక హెచ్చరిక లాంటివి.
ప్రిడిక్షన్ మార్కెట్లు: భవిష్యత్తులో జరిగే పరిణామాలపై బెట్టింగ్‌లు కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా నాయకుడు నికోలస్ మదురో అరెస్ట్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి 'పాలిమార్కెట్' (Polymarket) ద్వారా లక్షలాది డాలర్లు సంపాదించిన ఒక అమెరికన్ సైనికుడి ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. ఇలాంటివి మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన చెందారు.
బెర్క్‌షైర్ హాత్వేలో కొత్త శకం.. వెలితిగా వార్షిక సభ
{{/usCountry}}ప్రిడిక్షన్ మార్కెట్లు: భవిష్యత్తులో జరిగే పరిణామాలపై బెట్టింగ్‌లు కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా నాయకుడు నికోలస్ మదురో అరెస్ట్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి 'పాలిమార్కెట్' (Polymarket) ద్వారా లక్షలాది డాలర్లు సంపాదించిన ఒక అమెరికన్ సైనికుడి ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. ఇలాంటివి మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన చెందారు.
బెర్క్‌షైర్ హాత్వేలో కొత్త శకం.. వెలితిగా వార్షిక సభ
{{/usCountry}}ఈ ఏడాది బెర్క్‌షైర్ హతావే వార్షిక సమావేశం కొంత భిన్నంగా సాగింది. వారెన్ బఫెట్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ ఏబెల్ మొదటిసారి ఈ సభకు నాయకత్వం వహించారు. గ్రెగ్ ఏబెల్ మేనేజ్‌మెంట్ సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఉన్నప్పటికీ, సభలో ఎప్పటిలాంటి కోలాహలం కనిపించలేదు.
గత దశాబ్దాలుగా వారెన్ బఫెట్, చార్లీ ముంగర్ స్టేజీపై కూర్చుని పెట్టుబడి పాఠాలతో పాటు జీవిత సత్యాలను బోధించేవారు. 2023లో ముంగర్ మరణించడం, 95 ఏళ్ల బఫెట్ ఈసారి స్టేజీపై కాకుండా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని క్లుప్తంగా మాట్లాడటంతో పాత రోజులను గుర్తు చేసుకుని ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు. నాయకత్వం మారినప్పటికీ, బఫెట్ అందించిన 'విలువ ఆధారిత పెట్టుబడి' (Value Investing) సూత్రాలనే తాము పాటిస్తామని గ్రెగ్ ఏబెల్ స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
1. వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్‌ను బఫెట్ ఎందుకు జూదం అని పిలిచారు?
వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కంపెనీ విలువ లేదా పనితీరుతో సంబంధం ఉండదు. అది కేవలం కొన్ని గంటల వ్యవధిలో ధర ఎంత మారుతుందనే దానిపై కట్టే బెట్టింగ్ లాంటిది. ఇందులో రిస్క్ చాలా ఎక్కువ, అందుకే దీనిని బఫెట్ జూదంగా అభివర్ణించారు.
2. మార్కెట్ ధరలు 'సిల్లీ'గా ఉన్నాయని ఆయన ఎందుకు అన్నారు?
అత్యాశ పెరిగినప్పుడు జనం కంపెనీ లాభనష్టాలతో సంబంధం లేకుండా స్టాక్స్ కొంటారు. దీనివల్ల షేర్ ధర వాస్తవికతకు దూరంగా విపరీతంగా పెరిగిపోతుంది. దీనినే ఆయన 'సిల్లీ ప్రైస్' అని పేర్కొన్నారు.
3. బెర్క్‌షైర్ హాత్‌వే ప్రస్తుత సీఈఓ ఎవరు?
వారెన్ బఫెట్ వారసుడిగా గ్రెగ్ ఏబెల్ (Greg Abel) ప్రస్తుతం బెర్క్‌షైర్ హతావే సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
4. ఇన్వెస్టర్లకు బఫెట్ ఇచ్చే సలహా ఏమిటి?
మార్కెట్ ఉద్వేగాలకు (భయం, అత్యాశ) లోనుకాకుండా, కంపెనీ ప్రాథమిక విలువను చూసి పెట్టుబడి పెట్టాలని బఫెట్ సూచిస్తారు.