గ్లోబల్ వర్క్‌స్పేస్ దిగ్గజం 'వీవర్క్' (WeWork) తన వ్యాపార వైఫల్యాల నుంచి పుంజుకుని మళ్లీ సరికొత్త పునాదులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ సంస్కృతిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు వీవర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాన్ శాంటోరా పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. ఆఫీసులో ప్రొఫెషనల్ వాతావరణం, ఉద్యోగులపై నమ్మకం అనే రెండు సూత్రాల కలయికతోనే కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించడం సాధ్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఆఫీసులోకి పైజామాలు, స్లిప్పర్లు నో
బిజినెస్ ఇన్‌సైడర్ నిర్వహించిన ‘ది లాంగ్ ప్లే’ సదస్సులో ఆయన మాట్లాడారు. 2024లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక వీవర్క్ ఆఫీస్‌ను సందర్శించినప్పుడు, అక్కడి ఉద్యోగులు పైజామాలు, స్లిప్పర్లు, షార్ట్‌లు వేసుకుని కనిపించారట.
ఆ దృశ్యం చూసి నివ్వెరపోయిన శాంటోరా, వెంటనే హెచ్‌ఆర్ (HR) విభాగాధిపతిని పిలిచి, "ఇది ఆఫీసులా లేదు. ఇలాంటిది ఇకపై నా కంటికి కనిపించడానికి వీల్లేదు" అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెషనల్ ఆఫీస్ వాతావరణంలో డ్రెస్ కోడ్, డెకోరం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. రీయల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ 'కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్'లో ఏకంగా 47 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్న శాంటోరా, ఆ క్రమశిక్షణనే వీవర్క్‌లో కూడా అమలు చేయడం ప్రారంభించారు.
వారంలో ఒక రోజు 'హోమ్' ఫ్లెక్సిబిలిటీ
ఉద్యోగులపై కఠిన నిబంధనలు రుద్దడమే కాకుండా, వారి వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం సీఈఓగా తన బాధ్యత అని శాంటోరా నమ్ముతున్నారు. "ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు, ఏ సమయానికి వెళ్తున్నారనే దానిపై నేను నిఘా పెట్టను. వారు తమ బాధ్యతలను సరిగ్గా పూర్తి చేస్తున్నారా? కస్టమర్లను సంతృప్తి పరుస్తున్నారా? లేదా? అనేదే నాకు ముఖ్యం" అని ఆయన వెల్లడించారు.
ఇందులో భాగంగానే వారంలో ప్రతి శుక్రవారం ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని వెనుక ఆయన వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. "గతంలో నా కొడుకు మధ్యాహ్నం 3 గంటలకు బేస్‌బాల్ మ్యాచ్ ఆడుతుంటే, ఉద్యోగ బాధ్యతల వల్ల వెళ్లి చూడలేకపోయాను. అలాంటి పరిస్థితి నా ఉద్యోగులకు రాకూడదు. కుటుంబంతో గడిపే ప్రాధాన్య క్షణాలను వారు కోల్పోకూడదు" అని పేర్కొన్నారు. సాధారణంగా సూట్, టై ధరించే శాంటోరా.. శుక్రవారాల్లో మాత్రం స్నీకర్స్ వేసుకుని కాస్త క్యాజువల్‌గా ఆఫీస్‌కు వస్తానని చెప్పారు.
దివాలా నుంచి రికార్డు ఆదాయం వైపు..
{{/usCountry}}ఇందులో భాగంగానే వారంలో ప్రతి శుక్రవారం ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని వెనుక ఆయన వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. "గతంలో నా కొడుకు మధ్యాహ్నం 3 గంటలకు బేస్‌బాల్ మ్యాచ్ ఆడుతుంటే, ఉద్యోగ బాధ్యతల వల్ల వెళ్లి చూడలేకపోయాను. అలాంటి పరిస్థితి నా ఉద్యోగులకు రాకూడదు. కుటుంబంతో గడిపే ప్రాధాన్య క్షణాలను వారు కోల్పోకూడదు" అని పేర్కొన్నారు. సాధారణంగా సూట్, టై ధరించే శాంటోరా.. శుక్రవారాల్లో మాత్రం స్నీకర్స్ వేసుకుని కాస్త క్యాజువల్‌గా ఆఫీస్‌కు వస్తానని చెప్పారు.
దివాలా నుంచి రికార్డు ఆదాయం వైపు..
{{/usCountry}}2010లో ప్రారంభమైన వీవర్క్ స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లకు ఆఫీస్ స్పేస్‌లను అద్దెకు ఇస్తూ వేగంగా విస్తరించింది. ఒక దశలో 2019 నాటికి కంపెనీ మార్కెట్ విలువ 47 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే మాజీ సీఈఓ ఆడమ్ న్యూమ్యాన్ వివాదాస్పద నిర్ణయాలు, విఫలమైన ఐపీఓ (IPO) ప్రయత్నం వల్ల కంపెనీ విలువ 8 బిలియన్ డాలర్లకు పడిపోయి, చివరికి 'చాప్టర్ 11' దివాలా పిటిషన్ దాఖలు చేసే స్థితికి దిగజారింది.
2024లో బాధ్యతలు అందుకున్న జాన్ శాంటోరా కంపెనీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. నిరంతర సంస్కరణల ఫలితంగా వరుసగా ఎనిమిది త్రైమాసికాల పాటు సానుకూల ఈబీఐటీడీఏ (EBITDA) సాధించడమే కాకుండా, 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 19,000 కోట్లు పైమాటే) రాబడిని నమోదు చేసింది. కేవలం ఆర్థిక పునర్నిర్మాణమే కాకుండా, ఉద్యోగ సంస్కృతిని మార్చడం ద్వారానే వీవర్క్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందనడానికి శాంటోరా వ్యూహాలే నిదర్శనం.