...
...
Next Story

Claude Code design : అడోబ్​కి 'క్లాడ్ డిజైన్' ముప్పు.. ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్ సంచలనం!

Claude Code tool : అడోబ్​ వంటి దిగ్గజ డిజైన్​ సాఫ్ట్​వేర్​ దిగ్గజాలకు బిగ్​ షాక్! ఆంత్రోపిక్​కి చెందిన క్లాడ్​ కోడ్​ డిజైన్​ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అనుభవం ఉన్న డిజైనర్లు మాత్రమే కాకుండా, డిజైనింగ్ తెలియని వారు కూడా దీనిని ఉపయోగించి, సింపుల్​ ప్రాంప్ట్స్​తో డిజైన్​ క్రియేట్​ చేసుకోవచ్చు!

Published on: Apr 19, 2026, 16:01:45 IST
Advertisement

Claude Code design prompt : ఈ ఏడాది ఆరంభంలో ‘క్లాడ్ కోడ్’తో సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఆంత్రోపిక్.. ఇప్పుడు డిజైన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. ‘క్లాడ్ డిజైన్’ పేరుతో విడుదల చేసిన కొత్త ఏఐ టూల్.. అడోబ్, ఫిగ్మా వంటి కంపెనీల మార్కెట్ వాటాను దెబ్బతీసేలా కనిపిస్తోంది!

ఆంత్రోపిక్​ కొత్త డిజైన్​ టూల్..
ఆంత్రోపిక్​ కొత్త డిజైన్​ టూల్..

డారియో అమోడెయ్ నేతృత్వంలోని ఈ స్టార్టప్ 'క్లాడ్ డిజైన్'ను ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్​లో అడోబ్ షేర్లు 1.5% పడిపోగా, సెకండరీ మార్కెట్​లో ఫిగ్మా షేర్లు ఏకంగా 7% క్షీణించాయి.

అసలేంటి ఈ క్లాడ్​ డిజైన్​? దీని ప్రత్యేకతలేంటి? దీనిని ఎలా ఉపయోగించాలి? ఇక్కడ తెలుసుకోండి..

క్లాడ్ డిజైన్ అంటే ఏంటి?

క్లాడ్ డిజైన్ అనేది ఆంత్రోపిక్ లేటెస్ట్ క్లాడ్ ఓపస్ 4.7 (Claude Opus 4.7) మోడల్‌తో పనిచేసే ఒక పవర్‌ఫుల్ విజువల్ టూల్. ఇది కేవలం టెక్ట్స్ ప్రాంప్ట్‌ల ద్వారా ప్రొఫెషనల్ స్థాయి డిజైన్లను సృష్టించగలదు.

ఎవరి కోసం: అనుభవం ఉన్న డిజైనర్లు మాత్రమే కాకుండా, డిజైనింగ్ తెలియని వారు కూడా దీని ద్వారా ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్, పిచ్ డెక్స్ వంటివి సులభంగా తయారు చేయవచ్చు.

ఎలా పనిచేస్తుంది: వినియోగదారులు ఒక ఇమేజ్, డాక్యుమెంట్ (DOCX, PPTX, XLSX) అప్‌లోడ్ చేస్తే చాలు.. క్లాడ్ దానిని అందమైన విజువల్స్ రూపంలోకి మారుస్తుంది. అవసరమైతే కంపెనీ కోడ్‌బేస్‌ను నేరుగా లింక్ చేసి, టీమ్ డిజైన్ సిస్టమ్స్‌కు (కలర్స్, ఫాంట్స్) అనుగుణంగా డిజైన్లు పొందవచ్చు.

క్లాడ్ డిజైన్ ప్రత్యేకతలు..

పిచ్ డెక్స్: స్టార్టప్ ఫౌండర్లు తమ ఐడియాను నిమిషాల్లో ప్రెజెంటేషన్ ఫార్మాట్‌లోకి తీసుకురావచ్చు.

బ్రాండ్ కన్సిస్టెన్సీ: మీ టీమ్ వాడుతున్న రంగులు, ఫాంట్‌లను ఏఐ ఆటోమేటిక్‌గా గుర్తించి, ప్రతి ప్రాజెక్టులోనూ ఒకే రకమైన బ్రాండింగ్ ఉండేలా చూస్తుంది.

ఈజీ ఎగుమతి: తయారైన డిజైన్లను కెన్వా (Canva), PDF, PPTX లేదా HTML ఫైల్స్‌గా మార్చుకోవచ్చు.

క్లాడ్​ డిజైన్ ఎలా ఉపయోగించాలి?

క్లాడ్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలి.

మీకు కావాల్సిన డేటాను (స్క్రీన్‌షాట్ లేదా డాక్యుమెంట్) అప్‌లోడ్ చేయాలి.

క్లాడ్ జనరేట్ చేసిన డిజైన్‌ను చాట్ మెసేజ్ లేదా ఇన్-లైన్ కామెంట్స్ ద్వారా సరిదిద్దుకోవచ్చు.

అంతా పూర్తయ్యాక దానిని ‘క్లాడ్ కోడ్’కు పంపితే, అది నేరుగా ప్రొడక్షన్-రెడీ కోడ్‌ను అందిస్తుంది.

ఎవరికి అందుబాటులో ఉంది?

ప్రస్తుతానికి క్లాడ్ ప్రో, మ్యాక్స్, టీమ్, ఎంటర్‌ప్రైజ్ సబ్‌స్క్రైబర్లకు అదనపు ఖర్చు లేకుండా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే, ఇది యూజర్ సబ్‌స్క్రిప్షన్ లిమిట్స్‌పై ఆధారపడి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. క్లాడ్ డిజైన్ వల్ల ఫిగ్మా, అడోబ్ వంటి కంపెనీలకు నష్టమా?

అవును, డిజైన్ పనులను ఏఐ సులభతరం చేయడం వల్ల ఈ సాఫ్ట్‌వేర్ల వినియోగం తగ్గుతుందనే ఆందోళనతో మార్కెట్లో వీటి షేర్లు పడిపోతున్నాయి.

2. క్లాడ్ డిజైన్ వాడటానికి డిజైనింగ్ నాలెడ్జ్ అవసరమా?

అవసరం లేదు. సాధారణ భాషలో మీకు ఏం కావాలో టైప్ చేస్తే చాలు, క్లాడ్ మీ కోసం ప్రొఫెషనల్ డిజైన్లను సిద్ధం చేస్తుంది.

3. ఇందులో తయారైన డిజైన్లను కెన్వాలో ఎడిట్ చేయవచ్చా?

అవును, క్లాడ్ డిజైన్ నుంచి మీ ప్రాజెక్టులను నేరుగా కెన్వాలోకి ఎగుమతి చేసుకుని ఎడిట్ చేయవచ్చు.

4. క్లాడ్ డిజైన్ ఉచితంగా లభిస్తుందా?

ఇది కేవలం ప్రో, మ్యాక్స్, టీమ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks