...
...
Next Story

మీ ఫోన్​ నెంబర్​ని హ్యాక్​ చేస్తారు.. ఆ తర్వాత బ్యాంక్​ ఖాతా ఖాళీ! ఏంటి ఈ సిమ్​ స్వాప్​ స్కామ్​?

ప్రమాదకరమైన 'సిమ్-స్వాప్' మోసాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. మొసగాళ్లు ముందు మీ నెంబర్​ని హ్యాక్​ చేస్తారు, ఆ తర్వాత నిమిషాల్లో మీ బ్యాంక్​ అకౌంట్​ని ఖాళీ చేస్తారు! ఇది ఎలా సాధ్యం? ఎలా రక్షించుకోవాలి? పూర్తి వివరాలు..

Published on: Nov 05, 2025 09:15 AM IST
Advertisement

మీరు ఉదయం కాఫీ తాగుతుండగా, అకస్మాత్తుగా మీ ఫోన్‌కు సిగ్నల్ పోతుంది! కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, అసలేవీ లేవు. మీరు ఫోన్‌ను రీస్టార్ట్ చేసినా సమస్య అలాగే ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత, మీ ఈమెయిల్‌కు ఒక బ్యాంకింగ్ అలర్ట్ వస్తుంది! మీ ఖాతా నుంచి డబ్బు మాయమైపోతాయి.. దీనికి కారణం? మీ మొబైల్ నంబర్‌ను దొంగిలించిన ఒక మోసగాడు.

Sim swap scam might target you next.
Sim swap scam might target you next.

సిమ్-స్వాప్ ఫ్రాడ్ అని పిలుస్తున్న ఈ భయంకరమైన సైబర్‌క్రైమ్ వేగంగా విస్తరిస్తోంది. ఇది నేరగాళ్లకు మీ ఫోన్ నంబర్‌ను యాక్సెస్ చేసే వీలు కల్పిస్తుంది. దీని ద్వారా వారు మీ కాల్స్, టెక్ట్స్​లు, మీ ఆన్‌లైన్ ఖాతాలను రక్షించే ముఖ్యమైన ఒన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడ్డగించగలరు. ఒకసారి వారు మీ సిమ్​ని నియంత్రించిన తర్వాత, వారు మీ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయగలరు. మీ ఈమెయిల్‌ను హ్యాక్ చేయగలరు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఖాళీ చేయగలరు!

సిమ్-స్వాప్ మోసాలు ఎలా జరుగుతాయి?

సాధారణంగా ఈ మోసాలు డేటా దొంగతనంతో ప్రారంభమవుతుంది.

మోసగాళ్లు ఫిషింగ్ ఈమెయిల్‌లు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ లేదా లీకైన డేటాబేస్‌ల ద్వారా మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.

ఈ వివరాలతో, వారు మీలా నటిస్తూ మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తారు.

తమ ఫోన్ పోయిందని లేదా పాడైందని నమ్మబలికి, కొత్త సిమ్​ కార్డ్ ఇవ్వమని అభ్యర్థిస్తారు.

మొబైల్ ప్రొవైడర్ ఆ కొత్త సిమ్​ని యాక్టివేట్ చేయగానే, మీ అసలు సిమ్​ పూర్తిగా, వెంటనే డెడ్​ అవుతుంది. దానితో అటాకర్ మీ నంబర్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తాడు.

మీ సిమ్​ హైజాక్ అయ్యిందని గుర్తించే సంకేతాలు..

మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అకౌంట్‌కు తప్పనిసరిగా పిన్​ లేదా పాస్‌వర్డ్ సెట్ చేయండి. దీనివల్ల, ధృవీకరణ లేకుండా ఎవరూ మీ సిమ్​ని మార్చలేరు.

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ఎస్​ఎంఎస్​ ద్వారా వచ్చే కోడ్‌ల బదులు, ఆథెంటికేటర్​ యాప్​ (ఉదాహరణకు గూగుల్​ ఆథెంటికేటర్​)ను ఉపయోగించండి. ఇది హ్యాకర్లు మీ కోడ్‌లను అడ్డగించకుండా నిరోధిస్తుంది.

ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలను అతిగా పంచుకోవడం మానుకోండి.

తెలియని లింక్‌లను క్లిక్ చేయడం లేదా ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేయడం చేయవద్దు.

మీ బ్యాంక్, ఈమెయిల్ ఖాతాల్లో అసాధారణ కార్యకలాపాలను గమనించండి. నెట్‌వర్క్ సేవ కోల్పోతే, ఆలస్యం చేయకుండా వెంటనే మీ ప్రొవైడర్‌కు సమాచారం అందించండి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే, మోసాన్ని ఆపడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది.

మీ మొబైల్ నంబర్ అనేది కేవలం కాంటాక్ట్ వివరాల కంటే ఎక్కువ! ఇది మీ డిజిటల్ గుర్తింపు, ఆర్థిక వివరాలకు తాళం చెవి. దీనిపై నియంత్రణ కోల్పోవడం వినాశకరంగా ఉంటుంది! కానీ అవగాహన, తక్షణ చర్య మిమ్మల్ని ఒక అడుగు ముందు ఉంచుతుంది. మీ సీమ్​ని ఒక పాస్‌వర్డ్‌లా భావించండి, ఎందుకంటే నేటి ప్రపంచంలో అది అదే!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe