500 కి.మీ రేంజ్, ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్‌తో టాటా అవిన్యా ఈవీ..
టాటా మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్ రెడీ అవుతోంది. దాని పేరు టాటా అవిన్యా. ఇదొక ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన 5 ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
2026లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. ఇందులో భాగంగా టాటా అవిన్యా పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. లగ్జరీ కార్లకు ధీటుగా, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ 'టాటా అవిన్యా' గురించి ఐదు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

అవిన్యా అంటే ఏంటి?
'అవిన్యా' అంటే సంస్కృతంలో 'ఆవిష్కరణ' అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణలా ఉండబోతోందని టాటా మోటార్స్ చెబుతోంది. ఈ టాటా అవిన్యా ఈవీ కాన్సెప్ట్ వర్షెన్‌ని 2025 ఆటో ఎక్స్‌పోలో సంస్థ ఆవిష్కరించింది. అప్పుడే ఇది అందరి దృష్టిని ఆవిష్కరించింది.
టాటా అవిన్యా ఈవీ- టాప్ 5 విషయాలు ఇవే..
1. ప్రత్యేకమైన ప్రీమియం బ్రాండ్-
టాటా అవిన్యా కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇదొక ప్రత్యేకమైన 'ప్రీమియం బ్రాండ్'. టయోటాకు 'లెక్సస్' ఎలాగో, మారుతీకి నెక్సా ఎలాగో, టాటాకు 'అవిన్యా' అలా నిలవబోతోంది. దీనిని సాధారణ టాటా షోరూమ్‌లలో కాకుండా, కేవలం లగ్జరీ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చే ప్రత్యేక నెట్‌వర్క్ ద్వారా మాత్రమే విక్రయిస్తారు. దీనివల్ల వినియోగదారులకు ఒక సరికొత్త రాయల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
2. అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా-
గత ఆటో ఎక్స్‌పో, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'అవిన్యా ఎక్స్' కాన్సెప్ట్‌కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఒక కూపే ఎస్‌యూవీ తరహాలో, స్టైలిష్ ఎల్ఈడీ లైట్లు, కారు బాడీలో కలిసిపోయే డోర్ హ్యాండిల్స్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో ఈ కారు మనల్ని కట్టిపడేస్తుంది.
3. లివింగ్ రూమ్ ఆన్ వీల్స్-
అవిన్యా ఈవీ కారు లోపలి భాగాన్ని అత్యంత విలాసవంతంగా, ఒక లౌంజ్ మాదిరిగా రూపొందించారు. కేవలం స్క్రీన్లు, బటన్లతో గందరగోళంగా కాకుండా, ప్రశాంతంగా ప్రయాణించేలా 'మినిమలిస్ట్' డిజైన్‌ను ఎంచుకున్నారు. కారులో కూర్చుంటే మన ఇంట్లోని గదిలో కూర్చున్నంత సౌకర్యవంతంగా ఉండటమే దీని ప్రత్యేకత.
4. అత్యాధునిక టెక్నాలజీ-
ఈ టాటా అవిన్యా ఎలక్ట్రిక్ కారు డ్యాష్‌బోర్డ్ అంతా ఒక డిజిటల్ ఇంటర్ఫేస్లా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి భద్రతా ప్రమాణాలతో ఇది రాబోతోంది. ఫిజికల్ బటన్లు తక్కువగా ఉండి, కారులోని చాలా ఫంక్షన్స్ టచ్ లేదా వాయిస్ ద్వారా నియంత్రించేలా ఉంటాయి.
5. జెన్ 3 ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్-
కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసమే తయారు చేసిన 'జెన్ 3' ఆర్కిటెక్చర్ పై టాటా అవిన్యాను నిర్మిస్తున్నారు. దీనివల్ల కారు లోపల ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది. అలాగే కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా ఇది సపోర్ట్ చేస్తుందని సమాచారం.
టాటా నుంచి వస్తున్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.
టాటా అవిన్యాతో పాటు టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా ఈవీలను సైతం 2026లోనే లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళికలు రచిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


