WhatsApp new feature : వాట్సాప్‌లో అదిరిపోయే 'ఆర్గనైజేషన్స్' ఫీచర్! ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం 'ఆర్గనైజేషన్స్' పేరిట సరికొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. పెద్ద పెద్ద కమ్యూనిటీలు, సబ్-గ్రూప్‌లను సులువుగా మేనేజ్​ చేయడానికి అడ్మిన్లకు ఇది అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ టూల్‌గా ఉపయోగపడనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Oct 27, 2026, 13:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్’ తన యూజర్ల ఎక్స్​పీరియన్స్​ని మరింత మెరుగుపరిచేందుకు వరుసగా కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ.. 2022లో వేర్వేరు సంబంధిత గ్రూపులన్నింటినీ ఒకే చోటికి చేర్చేలా 'కమ్యూనిటీస్' ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కమ్యూనిటీ నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 'ఆర్గనైజేషన్స్' అనే విప్లవాత్మక ఫీచర్‌పై పనిచేస్తోంది!

వాట్సాప్ కొత్త ఫీచర్ అప్డేట్స్..
వాట్సాప్ కొత్త ఫీచర్ అప్డేట్స్..

అపార్ట్‌మెంట్ సొసైటీలు, ఆఫీస్ టీమ్‌లు, విద్యాసంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు నడిపే అడ్మిన్లకు ఈ ఫీచర్ ఒక గొప్ప వరంగా మారనుంది. పెద్ద కమ్యూనిటీలను, అందులోని సభ్యులను నిమిషాల వ్యవధిలో మేనేజ్​ చేసేందుకు ఇదొక ప్రత్యేక డిజిటల్ స్పేస్‌లా పనిచేస్తుందట.

అడ్మిన్ల ఇబ్బందులకు చెక్ పెట్టేలా 'ఆర్గనైజేషన్స్'!

ప్రస్తుతం వాట్సాప్ కమ్యూనిటీ అడ్మిన్లు ఏ సబ్-గ్రూప్‌లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎవరు ఎందులో ఉన్నారు? అనేది తెలుసుకోవడానికి ప్రతి గ్రూప్‌ను విడివిడిగా తనిఖీ చేయాల్సి వస్తోంది. వెయ్యి మందికి పైగా ఉన్న పెద్ద కమ్యూనిటీల్లో ఇది అడ్మిన్లకు తీవ్ర శ్రమతో కూడుకున్న పని.

ఇప్పుడు వాట్సాప్ అప్‌డేట్లను ట్రాక్ చేసే ‘వాబీటాఇన్ఫో’ ప్రకారం.. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.43.1లో ఈ ఆర్గనైజేషన్స్ ఫీచర్ కనిపించింది.

ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ద్వారా:

అన్ని వివరాలు ఒకే చోట: ఆర్గనైజేషన్ పేరు, దాని డిస్క్రిప్షన్, మొత్తం సభ్యుల సంఖ్య ఒకే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

వ్యూ ఆల్ ఆప్షన్: అడ్మిన్లు 'View All' ఆప్షన్ పై క్లిక్ చేసి, కమ్యూనిటీలోని సభ్యులు ఏ ఏ సబ్-గ్రూప్‌లలో భాగమై ఉన్నారో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

సాధారణ యూజర్లకు మార్పులు ఉంటాయా?

ఈ కొత్త ఆర్గనైజేషన్స్ ఫీచర్ అనేది కేవలం కమ్యూనిటీ అడ్మిన్ల కోసం రూపొందించిన ఒక ‘అదనపు మేనేజ్‌మెంట్ లేయర్’ మాత్రమే! సాధారణ కమ్యూనిటీ సభ్యులు దీనితో నేరుగా ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వారి సాధారణ గ్రూప్ చాట్‌లు, మెసేజ్‌లు ఎప్పటిలాగే యథాతథంగా కొనసాగుతాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం డెవలప్‌మెంట్ ఆరంభ దశలో ఉంది. బీటా టెస్టర్లకు కూడా ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.

త్వరలో రానున్న మరిన్ని వాట్సాప్ ఫీచర్లు..

కేవలం ఆర్గనైజేషన్స్ మాత్రమే కాకుండా, మరికొన్ని ఆసక్తికర ఫీచర్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తోంది. అవి..

షెడ్యూల్డ్ మెసేజెస్ : నిర్దిష్ట సమయానికి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా వెళ్లేలా షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు రానుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షార్ట్‌కట్ : చాట్‌లలోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను సులువుగా షేర్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక షార్ట్‌కట్‌ను జోడించబోతున్నారు.

నూతన సాంకేతిక మార్పులతో వాట్సాప్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More