మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది! మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చాలాకాలంగా యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ గురించి వాట్సాప్ హెడ్ కునాల్ షా ఒక బ్లాగ్ పోస్ట్ లింక్‌ను పంచుకున్నారు.

దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వాట్సాప్ నిత్యజీవితంలో భాగమైంది. అర్ధరాత్రి 12 గంటలకు మిత్రులు, కుటుంబ సభ్యులకు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకునే వారికి, పండుగల వేళ ఒకేసారి ఆత్మీయులకు విషెస్ పంపాల్సిన వారికి ఈ 'వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్' ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం పూట ఆఫీసు లేదా వ్యాపార సంబంధిత రిమైండర్‌లను ముందుగానే సెట్ చేసి పెట్టుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. థర్డ్-పార్టీ యాప్‌లు వాడకుండా నేరుగా వాట్సాప్‌లోనే ఈ సౌకర్యం రావడం భద్రత పరంగానూ వినియోగదారులకు ఊరటనిస్తోంది.
వాట్సాప్ షెడ్యూల్డ్ మెసేజ్- 10 నిమిషాల నుంచి 14 రోజుల ముందు వరకు..
“సరైన సమయంలో షెడ్యూల్డ్ మెసేజ్‌లతో చెప్పండి” (Say it at the right time with scheduled messages) అనే శీర్షికతో వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ వివరాలను వెల్లడించింది. యూజర్లు ఇప్పుడు తమ మెసేజ్‌లను కనీసం 10 నిమిషాల నుంచి గరిష్టంగా 14 రోజుల ముందు వరకు షెడ్యూల్ చేయవచ్చు. గ్రూప్ చాట్‌లలోనైనా, వ్యక్తిగత సంభాషణలలోనైనా ఈ సదుపాయం పనిచేస్తుంది. తాము అత్యధికంగా కోరిన ఫీచర్లలో షెడ్యూల్డ్ మెసేజ్‌లు ఒకటని వాట్సాప్ పేర్కొంది.
వాట్సాప్‌లో మెసేజ్ షెడ్యూల్డ్ చేయడం ఎలా?
మెసేజ్ షెడ్యూల్డ్ చేసే విధానాన్ని వాట్సాప్ చాలా సులభంగా రూపొందించింది. వినియోగదారులు మెసేజ్ టైప్ చేసిన తర్వాత ‘సెండ్’ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. ఆపై మెసేజ్ ఎప్పుడు చేరాలో ఆ తేదీ, సమయాన్ని ఎంచుకుంటే సరిపోతుంది!
{{/usCountry}}మెసేజ్ షెడ్యూల్డ్ చేసే విధానాన్ని వాట్సాప్ చాలా సులభంగా రూపొందించింది. వినియోగదారులు మెసేజ్ టైప్ చేసిన తర్వాత ‘సెండ్’ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. ఆపై మెసేజ్ ఎప్పుడు చేరాలో ఆ తేదీ, సమయాన్ని ఎంచుకుంటే సరిపోతుంది!
{{/usCountry}}“మెసేజ్ షెడ్యూల్ చేయడానికి సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి, అది ఎప్పుడు చేరాలో ఆ తేదీ, సమయాన్ని ఎంచుకోండి,” అని వాట్సాప్ బ్లాగ్ పోస్ట్ వివరించింది.
“ఇకపై పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారిలో మీరే ముందుండండి. షెడ్యూల్డ్ మెసేజ్‌లు ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చేశాయి,” అంటూ కునాల్ షా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రిసీవర్‌కు ఇది షెడ్యూల్డ్ మెసేజ్ అని తెలుస్తుందా?
లేదు! అందుకున్న వ్యక్తికి ఇది మిగతా సాధారణ మెసేజ్‌లాగే కనిపిస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది. మెసేజ్ షెడ్యూల్ చేసి పంపినట్లు అవతలి వారికి ఎలాంటి ప్రత్యేక గుర్తు కనిపించదు.
ఫోన్ ఆఫ్‌లో ఉన్నా మెసేజ్ వెళుతుందా? భద్రత మాటేంటి?
సాధారణ మెసేజ్‌ల తరహాలోనే షెడ్యూల్డ్ మెసేజ్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది.
“మీ ఫోన్ ఆఫ్‌లో ఉన్నా లేదా బ్యాటరీ అయిపోయినా, మీరు ఎంచుకున్న సమయానికి షెడ్యూల్డ్ మెసేజ్ చేరుతుంది; వ్యక్తిగత మెసేజ్‌ల మాదిరిగానే ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది కాబట్టి మరెవరూ దీన్ని చదవలేరు, కనీసం మేము కూడా చదవలేము,” అని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్ షెడ్యూల్డ్ మెసేజ్- అందరికీ వెంటనే వస్తుందా?
షెడ్యూల్డ్ మెసేజ్‌ల ఫీచర్‌ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తోంది. అందువల్ల కొంతమంది యూజర్లకు ఈ సదుపాయం వెంటనే కనిపించకపోవచ్చు.
“షెడ్యూల్డ్ మెసేజ్‌లు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలతో పనిచేస్తాయి; రాబోయే వారాల్లో వీటిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నాము,” అని సంస్థ స్పష్టం చేసింది.
త్వరలోనే ఇండియాలో కూడా అందరికీ ఈ వాట్సాప్ షెడ్యూల్డ్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.