Amazon prime day : అమెజాన్‌లో ఆఫర్లు, డిస్కౌంట్ల జాతర! ప్రైమ్ డే సేల్ 2026 డేట్స్ ఇవే..
Amazon prime day sale 2026 India : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఐకానిక్ ‘ప్రైమ్ డే సేల్ 2026’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, సంస్థకు ఇది 10వ ప్రైమ్ డే సేల్ కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ సేల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
ఆన్‌లైన్ షాపర్లకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తన ఐకానిక్ ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తేదీలను ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. విశేషం ఏంటంటే.. అమెజాన్ హిస్టరీలోనే ఇది 10వ ప్రైమ్ డే సేల్ కావడం గమనార్హం. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రత్యేక సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది! స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హోమ్ అప్లయన్సెస్ వంటి అనేక విభాగాల్లో ఊహించని ఆఫర్లను అందించేందుకు అమెజాన్ సిద్ధమైంది.

వీటికి తోడు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి మీ విష్‌లిస్ట్‌లో ఉన్న వస్తువులను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కానుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్: తేదీలు, టైమింగ్స్..
- సేల్ ప్రారంభం: జులై 4వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటలకు
- సేల్ ముగింపు: జులై 6వ తేదీ రాత్రి 11:59 గంటలకు
ఈ సేల్ ప్రయోజనాలను కేవలం ప్రైమ్ మెంబర్లు మాత్రమే పొందగలరని గుర్తుపెట్టుకోవాలి. అందుకే, ఇప్పటివరకు మెంబర్‌షిప్ లేని వారి కోసం అమెజాన్ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది.
సాధారణంగా రూ. 1,499 గా ఉండే వార్షిక ప్రైమ్ ప్లాన్ ఇప్పుడు కేవలం రూ. 999 కే లభిస్తుంది. రూ. 799 విలువైన ప్రైమ్ లైట్ వార్షిక ప్లాన్‌ను రూ. 599 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్‌పై కూడా రూ. 100 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల కేవలం సేల్ ఆఫర్లే కాకుండా.. ఒకే రోజులో ప్రొడక్ట్ డెలివరీ, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ బుక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్రీమియం సేవలను ఉచితంగా పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్- బ్యాంకు డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు..
తన 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని.. అమెజాన్ ఈసారి ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ‘10వ యానివర్సరీ డీల్స్’ని ప్రవేశపెడుతోంది. వీటితో పాటు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి (ఈఎంఐ లావాదేవీలతో కలిపి) అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే ప్రైమ్ మెంబర్లకు ఎలాంటి పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
దీనితో పాటు వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఐకూ, రెడ్‌మీ, లెనోవో, హెచ్‌పీ, వూప్, ఎల్‌జీ, బాష్, లెగో, అడిడాస్, అలెన్ సోలీ వంటి టాప్ బ్రాండ్ల నుంచి మునుపెన్నడూ చూడని డీల్స్ ఈ సేల్‌లో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ద్వారా దాదాపు 500 కంటే ఎక్కువ కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్- షాపింగ్‌ను సులువు చేయనున్న ఏఐ!
కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ తన సరికొత్త ఏఐ అసిస్టెంట్ ‘రూఫస్’ సేవలను ఈ సేల్‌లో ఉపయోగించబోతోంది. ఈ కన్వర్సేషనల్ ఏఐ అసిస్టెంట్ కస్టమర్ల వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా బెస్ట్ ప్రొడక్ట్ రికమండేషన్స్ ఇవ్వడమే కాకుండా, ధరల విశ్లేషణ, వివిధ ప్రొడక్టుల మధ్య పోలికలను సులభంగా వివరిస్తుంది. అలాగే ఏఐ రివ్యూ హైలైట్స్, క్విక్ వ్యూ, బయ్యింగ్ గైడ్స్ వంటి ఫీచర్లు కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి. వేల సంఖ్యలో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నప్పుడు, ఇటువంటి ఏఐ టూల్స్ కస్టమర్లకు తమ బడ్జెట్, అవసరాలకు తగిన బెస్ట్ వస్తువును ఎంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రస్తుతం మెమరీ చిప్స్ ధరలు పెరగడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు మార్కెట్లో భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో వస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ భారీ డిస్కౌంట్లతో మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెజాన్ అధికారికంగా సేల్ తేదీలను ప్రకటించడంతో, రాబోయే రోజుల్లో ప్రముఖ బ్రాండ్లన్నీ తమ ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా బయటపెట్టే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


