ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడంతో.. గృహాలను ఆదుకునేందుకు దేశంలో కేవలం కమర్షియల్ ఎల్‌పీజీ ధరను మాత్రమే పెంచినట్లు, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరను యథాతథంగా ఉంచినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

'పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉన్నాయి. మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. సాధారణంగా నెలవారీగా సవరిస్తారు. దేశంలో వినియోగించే మొత్తం ఎల్పీజీలో వీటి వినియోగం 10 శాతం కంటే తక్కువగా ఉంది.' అని మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 913 వద్ద యథాతథంగా కొనసాగుతూ, గృహ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉందని ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పీఎంయూవై పథకం కింద పేదల కోసం రాయితీపై అందించే ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 613 వద్ద యథాతథంగా ఉంది.
పాకిస్థాన్‌లో సిలిండర్‌కు రూ. 1,046, శ్రీలంకలో రూ. 1,242, నేపాల్‌లో రూ. 1,208గా ఉన్న ధరతో పోలిస్తే.. భారతదేశ దేశీయ ఎల్‌పీజీ ధర ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ. 94.77, రూ. 87.67 వద్ద యథాతథంగా ఉన్నాయని(ఢిల్లీ ధరలు) మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి లీటరుకు రూ. 2 సవరణ కేవలం ప్రీమియం పెట్రోల్ వేరియంట్‌లైన XP95, Power95, Speed -అధిక ఆక్టేన్ పనితీరు గల ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. వీటి ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తారు. వీటి అమ్మకాలు మొత్తం పెట్రోల్, డీజిల్ ధరల అమ్మకాల పరిమాణంలో 2 నుండి 5 శాతం మాత్రమే ఉంటాయి. వాహనదారులు తమ ఇష్టానుసారం ఈ రకమైన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ధరలు 30-50 శాతం మేర పెరిగినప్పటికీ.. భారతదేశంలోని ప్రతి పంపులోనూ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ధరలు 30-50 శాతం మేర పెరిగినప్పటికీ.. భారతదేశంలోని ప్రతి పంపులోనూ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}మెుత్తానికి ఇంధన ధరలు పెంచే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. చమురు, గ్యాస్ నిల్వలలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే.. ఆందోళనతో అధికంగా కొనాల్సిన పని లేదని చెప్పింది. ప్రస్తుతానికి ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే.. తదుపరి చర్యలపై కూడా కేంద్రం ఇప్పటి నుంచే ఆలోచిస్తోంది. 2022 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు డీజిల్, పెట్రోలు ధరలను పెంచలేదని కేంద్రం తెలిపింది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామని వెల్లడించింది.