...
...
Next Story

PayPal layoffs : ఆఫీసుకు వెళ్లగానే షాక్! పేపాల్​ ఇండియాలో సడెన్​గా 600 మంది ఉద్యోగాలు కట్..

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ ఇండియాలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లోని టెక్, ఇంజినీరింగ్ వర్కర్లపై ఈ లేఆఫ్‌ల ప్రభావం పడగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Sep 3, 2026, 13:07:08 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల కోత భయాలు భారతీయ టెక్కీలను మళ్లీ వణికిస్తున్నాయి! ఈ నేపథ్యంలోనే ప్రముఖ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ‘పేపాల్’ భారతీయ కార్యాలయాల్లో భారీ స్థాయిలో లేఆఫ్‌లు చేపట్టింది. కంపెనీ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా భారతదేశంలో దాదాపు 600 మంది ఉద్యోగులపై వేటు వేసింది! ఇది ఇండియాలో ఉన్న సంస్థ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతానికి సమానం.

ఈ ప్రాంతాల్లో పేపాల్ లేఆఫ్స్​..

పేపాల్ లేఆఫ్స్ 2026 అప్డేట్స్..
పేపాల్ లేఆఫ్స్ 2026 అప్డేట్స్..

చెన్నై, బెంగళూరులతో పాటు హైదరాబాద్‌ నగరాల్లోని పేపాల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాల సిబ్బందిని ఈ లేఆఫ్‌లు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ రౌండ్ లేఆఫ్‌లకు ముందు భారత్‌లో పేపాల్‌కు 6,000 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, పునర్నిర్మాణ ప్రక్రియ ముగిసేనాటికి ఈ సంఖ్య మరింత తగ్గొచ్చని సమాచారం.

జాతీయ మీడియా కథనం ప్రకారం, మున్ముందు ఏకంగా 25 శాతం మంది (సుమారు 1,500 మంది) ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

పేపాల్ ఉద్యోగులు ఆవేదన!

కంపెనీ యాజమాన్యం తమను తొలగించిన తీరుపై ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా హెచ్చరికలు ఇవ్వకుండానే ఆగస్టు 31 సోమవారం ఉదయం అర్జెంట్‌గా ఆన్‌లైన్ మీటింగ్‌లో జాయిన్ అవ్వాలని పిలిచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాల్‌లోనే అనేత మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారని, కాల్ ముగిసిన మరుక్షణమే ఆఫీస్ లాగిన్ యాక్సెస్‌లను పూర్తిగా నిలిపివేసారని తెలిపారు.

"మాకు ఏ ముందస్తు సమాచారం లేదు. సోమవారం ఉదయం విధుల్లోకి రాగానే మీటింగ్ లింక్ వచ్చింది, అందులో మమ్మల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. మీటింగ్ పూర్తవగానే సిస్టమ్స్ బంద్ అయ్యాయి. ఆ తర్వాత ఆఫ్-బోర్డింగ్ ప్రక్రియకు సంబంధించి కేవలం ఒక ఈమెయిల్ మాత్రమే పంపారు," అని ఒక ఉద్యోగి తెలిపాడు. పరిహారం కింద ఒక నెల జీతం ఇస్తామని, జాబ్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పినప్పటికీ, సెటిల్‌మెంట్ నిధులు ఇంకా చేతికి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఖర్చుల కోత.. ఏఐ ఎఫెక్ట్!

ఒక్క పేపాల్ మాత్రమే కాకుండా.. ఉబెర్ ప్రపంచవ్యాప్తంగా 3,300 మందిని, ఒరాకిల్ సుమారు 10,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. సాంకేతిక రంగంలో వస్తున్న ఏఐ మార్పులు, ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల ఒక్క ఈ ఏడాదే ఇప్పటివరకు 1,28,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని 'Layoffs.fyi' గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe