జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, వాటినే విజయానికి మెట్లుగా మార్చుకున్న ఒక మహిళ కథ ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, మాతృత్వం, ఆపై తన సొంత కాళ్లపై నిలబడటానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. డాక్టర్ ప్రియా పోర్వాల్ (39) అనే పీహెచ్‌డీ స్కాలర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న తన జీవిత ప్రయాణం ప్రస్తుతం మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
కెరీర్ ఆరంభం, ఎదురుదెబ్బలు

డాక్టర్ ప్రియా పోర్వాల్ ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆమె బోధనా రంగంలో కొనసాగారు. అయితే, ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ, ఐదేళ్ల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు (లే-ఆఫ్). "ఆ అనుభవం నన్ను తీవ్రంగా కలచివేసింది. కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. నా కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లు అనిపించింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో ఆమెకు బాబు పుట్టాడు. దీంతో ఆమె తన 12 ఏళ్ల కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ కెరీర్‌ను ప్రారంభించడానికి ప్రియ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పలు కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఆ తర్వాత మరో కాలేజీలో అకడమిక్ ఉద్యోగం సంపాదించారు. కానీ, అక్కడి పని వాతావరణం ఆమె అంచనాలకు తగినట్టుగా లేకపోవడంతో ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. "ఎంటెక్, ఎంబీఏ, డాక్టరేట్ వంటి ఉన్నత డిగ్రీలు ఉన్నప్పటికీ, కెరీర్‌ను మళ్లీ సున్నా నుండి ప్రారంభించడం చాలా కష్టమైంది" అని ఆమె రాసుకొచ్చారు.
కొవిడ్ సమయంలో మలుపు
ఆమెకు 37 ఏళ్లు ఉన్నప్పుడు, కరోనా మహమ్మారి సమయంలో, రెండేళ్ల బాబును చూసుకుంటూనే తన కెరీర్‌ను తానే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. "నేను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా సొంత నిబంధనలపై నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను" అని ఆమె తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెప్పారు.
{{/usCountry}}ఆమెకు 37 ఏళ్లు ఉన్నప్పుడు, కరోనా మహమ్మారి సమయంలో, రెండేళ్ల బాబును చూసుకుంటూనే తన కెరీర్‌ను తానే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. "నేను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా సొంత నిబంధనలపై నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను" అని ఆమె తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెప్పారు.
{{/usCountry}}మొదట్లో కెమెరా ముందుకు రావడానికి ఆమె చాలా భయపడ్డారు. అందువల్ల తన ఆన్‌లైన్ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తన స్నేహితులు, కుటుంబ సభ్యులను బ్లాక్ చేశానని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ భయాన్ని అధిగమించి డిజిటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, తన ఉనికిని చాటుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.
సొంతంగా ఎదిగి..
"ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే: మాతృత్వం (Maternity) అనేది మీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ కాదు. పరిస్థితులు నా భవిష్యత్తును శాసించడాన్ని నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు నేనే బాస్. నా కొడుకు పక్కనే ఉంటూ, వాడి ఆలనా పాలనా చూసుకుంటూనే నేను నా పని చేసుకుంటున్నాను" అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. గతేడాది తన డిజిటల్ బిజినెస్ ద్వారా ఆమె యూఎస్‌డీ (USD)లో ఐదంకెల ఆదాయాన్ని (డాలర్లలో) ఆర్జించినట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా స్పందన
ప్రియా పోర్వాల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
"నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన సందేశం. బలమైన సంకల్పం ఉంటే మనల్ని ఏదీ ఆపలేదు" అని ఒకరు కామెంట్ చేశారు.
"చాలా స్ఫూర్తినిచ్చావు ప్రియా. నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది, మీరు అనుభవించే బాధను నేను అర్థం చేసుకోగలను" అని మరొకరు రాశారు.
"ఇది చాలా శక్తివంతమైన పోస్ట్. కానీ కెరీర్‌ను తిరిగి ప్రారంభించడం కంటే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన చోట మన గుర్తింపును తిరిగి నిర్మించుకోవడమే చాలా కష్టం" అని మూడో యూజర్ పేర్కొన్నారు.