Xiaomi 17 Max : షావోమి నుంచి అల్టిమేట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్- అల్లాడిస్తున్న ఫీచర్లు..

Xiaomi 17 Max India launch : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సరికొత్త అల్టిమేట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ‘Xiaomi 17 Max’ ను చైనా మార్కెట్​లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. షావోమి చరిత్రలోనే అతిపెద్ద 8000ఎంఏహెచ్ బ్యాటరీ, లీకా బ్రాండెడ్ 200ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ రాబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: May 17, 2026 9:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Xiaomi 17 Max price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి మార్కెట్​లోకి సరికొత్త సంచలనాన్ని తీసుకురాబోతోంది! తమ అల్టిమేట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ అయిన ‘షావోమి 17 మాక్స్’ను చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్ వంటి కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. షావోమి స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డులను సృష్టించబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

షావోమీ 17 మ్యాక్స్..
షావోమీ 17 మ్యాక్స్..

షావోమి 17 మాక్స్ ఫీచర్లు (కన్ఫర్మ్)..

అతిపెద్ద 8,000ఎంఏహెచ్ బ్యాటరీ:

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీనే. షావోమి మొబైల్స్‌లో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ సామర్థ్యం గల 8,000ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడం కోసం 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.

డిస్‌ప్లే బాడీ బిల్డ్:

ఈ ఫోన్ 6.9-ఇంచ్ భారీ 2కే ఎల్​టీపీఓ ఓఎల్​ఈడీ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అద్భుతమైన విజువల్స్, బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనికి మెటల్ ఫ్రేమ్, మెరుగైన హాప్టిక్ పర్ఫార్మెన్స్ కోసం ఎక్స్-యాక్సిస్ మోటార్‌ను ఉపయోగించారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్​తో వస్తుంది. అంటే ఈ షావోమి 17 మ్యాక్స్ కేవలం 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల పాటు తట్టుకోవడమే కాకుండా.. ఏ దిశ నుంచి వచ్చే వేడి, చల్లటి నీటి జెట్ ప్రవాహాలను అయినా సులభంగా తట్టుకోగలదు.

లీకా 200ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్:

షావోమి 17 మాక్స్ కెమెరా విభాగంలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది. ఇందులో లీకా (LEICA) బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.

ప్రైమరీ కెమెరా: ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 200ఎంపీ శాంసంగ్ హెచ్​పీ9 సెన్సార్.

సెకండ్ కెమెరా: 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్.

థర్డ్ కెమెరా: 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32ఎంపీ పవర్‌ఫుల్ షూటర్​ని అందించారు.

ప్రాసెసర్, ఇతర ఫీచర్లు :

ఈ సూపర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్వాల్కమ్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇప్పటికే మార్కెట్​లోకి వచ్చిన షావోమి 17, షావోమి 17 అల్ట్రాలలో కూడా ఇదే చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అదనంగా ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్​బీ 3.2 జెన్ 1 పోర్ట్‌ను కూడా చేర్చారు.

ఈ మోడల్​ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

షావోమి 17 మ్యాక్స్- ఇండియా లాంచ్ అప్‌డేట్స్..

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే చైనాలో అడుగుపెట్టబోతోంది. అయితే, భారత మార్కెట్​లో దీని విడుదల తేదీ లేదా టైమ్‌లైన్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ షావోమి ఇప్పటికే ఇండియాలో షావోమి 17, 17 అల్ట్రా మోడళ్లను విజయవంతంగా లాంచ్ చేసినందున, ఈ 'షావోమి 17 మాక్స్' ను కూడా త్వరలోనే భారత మార్కెట్​లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోందని లీక్స్​ సూచిస్తున్నాయి. ఇది ఇండియాలో లైనప్‌లోనే అత్యంత ప్రీమియం ఫోన్‌గా నిలవనుంది.

ఇదిలా ఉంటే, గ్లోబల్ మార్కెట్ ప్రియుల కోసం షావోమి మే 28న అంతర్జాతీయ మార్కెట్లలో షావోమి 17టీ, షావోమి 17టీ ప్రో మోడళ్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గ్లోబల్ లీక్స్ వెల్లడిస్తున్నాయి.

SpecificationXiaomi 17 Max
Display6.9-inch 2K LTPO OLED, flat panel
ProcessorQualcomm Snapdragon 8 Elite Gen 5
Battery8,000mAh
Wired Charging100W fast charging
Wireless Charging50W wireless charging
Rear CamerasTriple LEICA-tuned camera setup
Primary Camera200MP Samsung HP9 with OIS
Ultra-wide Camera50MP ultra-wide lens
Telephoto Camera50MP periscope lens with 3x optical zoom
Front Camera32MP selfie camera
Water/Dust ResistanceIP69
Fingerprint SensorUltrasonic in-display sensor
FrameMetal frame
HapticsX-Axis linear motor
PortUSB 3.2 Gen 1
Launch TimelineExpected to debut in China this month
India AvailabilityNot announced yet
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More