ప్రముఖ టూ-వీలర్ దిగ్గజం యమహా ఇండియా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈసీ-06ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ ఈ- స్కూటర్, ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు అనువుగా తయారైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్కూటర్‌ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘రివర్’ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఇది చూడటానికి రివర్ ఇండీ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, యమహా తన మార్కు స్టైల్‌ను జోడించింది. ఈ నేపథ్యంలో యమహా ఈసీ-06, రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి, వీటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాము..

యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- ధరల మధ్య వ్యత్యాసం..
ధర విషయంలో యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే రివర్ ఇండీ కొంత తక్కువగా ఉంది.
| యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- ధరలు | ||
|---|---|---|
| యమహ ఈసీ-06 | రివర్ ఇండీ | |
| ఎక్స్‌షోరూం ధర | రూ. 167,600 | రూ. 145,999 |
యమహా ఈసీ-06: రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్)
రివర్ ఇండీ: రూ. 1,45,999 (ఎక్స్-షోరూమ్)
యమహా బ్రాండ్ వాల్యూ, సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా ఈ స్కూటర్ రివర్ ఇండీ కంటే రూ. 21,601 అదనపు ప్రీమియం ధరను కలిగి ఉంది.
యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ- పర్ఫార్మెన్స్..
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ ఒకే రకమైన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. కానీ రేంజ్, టాప్ స్పీడ్ విషయంలో చిన్నపాటి మార్పులు ఉన్నాయి:
{{/usCountry}}ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ ఒకే రకమైన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. కానీ రేంజ్, టాప్ స్పీడ్ విషయంలో చిన్నపాటి మార్పులు ఉన్నాయి:
{{/usCountry}}| యమహా ఈసీ-06 వర్సెస్ రివర్ ఇండీ - పర్ఫార్మెన్స్ | ||
|---|---|---|
| యమహా ఈసీ-06 | రివర్ ఇండీ | |
| బ్యాటరీ | 4 కేడబ్ల్యూ | 4 కేడబ్ల్యూ |
| రేంజ్ | 169 కి.మీ | 163 కి.మీ |
| పవర్ | 8.98 బీహెచ్పీ | 8.98 బీహెచ్పీ |
| టార్క్ | 26 ఎన్ఎం | 26 ఎన్ఎం |
| టాప్ స్పీడ్ | 79 కేఎంపీహెచ్ | 90 కేఎంపీహెచ్ |
యమహా ఈసీ-06లో 4 కేడబ్ల్యూ బ్యాటరీని ఇచ్చింది సంస్థ. దీని టాప్ స్పీడ్ 79 కేఎంపీహెచ్. రేంజ్ 169 కి.మీ. టార్క్ 26 ఎన్ఎం. ఇక రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా 4 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కానీ ఇది 163 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్.