ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లకే పరిమితమైన కంపెనీలు.. ఇప్పుడు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ల వైపు అడుగులు వేస్తున్నాయి! ఈ రేసులో జపాన్ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘యమహా’ అందరికంటే ముందుండాలని చూస్తోంది.

గత ఏడాది చివర్లో జరిగిన టోక్యో మొబిలిటీ షోలో యమహా కంపెనీ ‘ప్రోటో బీఈవీ’ అనే ట్రాక్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్‌బైక్ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా బయటకు వచ్చిన కంపెనీ పేటెంట్ ఫైలింగ్స్ ఆధారంగా.. యమహా ఈ ప్లాట్‌ఫారమ్‌పై రోడ్ల మీద నడిచే ఒక పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీని లుక్, బాడీ కొలతలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ‘యమహా వైజెడ్ఎఫ్-ఆర్7’ బైక్‌ను పోలి ఉండే అవకాశం ఉంది.
యమహా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ విశేషాలు..
ప్రస్తుతం లీకైన పేటెంట్ డ్రాయింగ్‌ల ద్వారా ఈ సరికొత్త మోటార్‌సైకిల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, కొన్ని కీలకమైన అంశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బైక్‌లో గట్టి బీమ్-స్టైల్ ఫ్రేమ్, భారీ సైజులో ఉండే బ్యాటరీ ప్యాక్, వెనుక చక్రానికి పవర్‌ను అందించే బెల్ట్-డ్రైవ్ సిస్టమ్‌ను యమహా ఉపయోగించినట్లు డ్రాయింగ్స్ ద్వారా అర్థమవుతోంది.
ఈ బైక్‌లో అన్నింటికంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం దాని ఛార్జింగ్ కనెక్టర్. హోండా కంపెనీకి చెందిన డబ్ల్యూఎన్7 కాన్సెప్ట్ బైక్‌లో కనిపించినటువంటి ‘టైప్ 2’ ఛార్జింగ్ పోర్ట్‌ను ఇందులో అమర్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే, ఈ టైప్ 2 ఛార్జింగ్ పోర్ట్ ఉన్న బైక్‌లలో పెద్ద బ్యాటరీ ప్యాక్, వేగంగా ఛార్జ్ అయ్యే అత్యధిక ఛార్జింగ్ సామర్థ్యాలు ఉంటాయి. అంతేకాకుండా, సాధారణ బైక్‌లలో ఉండే క్లచ్ లివర్ స్థానంలో, చేత్తో ఆపరేట్ చేసే రేర్ బ్రేక్ లివర్‌ను అమర్చారు. అంటే ఈ బైక్‌కు కుడి కాలితో నొక్కే బ్రేక్ పెడల్ ఉండదు.
సరికొత్త బ్రేకింగ్ టెక్నాలజీ!
ఈ కొత్త పేటెంట్ ముఖ్యంగా బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఒక వినూత్న సాంకేతికతపై దృష్టి సారించింది. యమహా తన సరికొత్త డిజైన్‌లో ఏబీఎస్ హైడ్రాలిక్ యూనిట్‌ను సాధారణంగా ఉండే సీటు కింద కాకుండా, హ్యాండిల్ బార్ వెనుక భాగంలో అమర్చింది. ఈ విధమైన లేఅవుట్ వల్ల మాస్టర్ సిలిండర్లను, ఏబీఎస్ యూనిట్‌ను అనుసంధానించే హైడ్రాలిక్ లైన్ల (వైర్లు) పొడవు చాలా వరకు తగ్గుతుందని, దీనివల్ల బ్రేకింగ్ సిస్టమ్ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
{{/usCountry}}ఈ కొత్త పేటెంట్ ముఖ్యంగా బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఒక వినూత్న సాంకేతికతపై దృష్టి సారించింది. యమహా తన సరికొత్త డిజైన్‌లో ఏబీఎస్ హైడ్రాలిక్ యూనిట్‌ను సాధారణంగా ఉండే సీటు కింద కాకుండా, హ్యాండిల్ బార్ వెనుక భాగంలో అమర్చింది. ఈ విధమైన లేఅవుట్ వల్ల మాస్టర్ సిలిండర్లను, ఏబీఎస్ యూనిట్‌ను అనుసంధానించే హైడ్రాలిక్ లైన్ల (వైర్లు) పొడవు చాలా వరకు తగ్గుతుందని, దీనివల్ల బ్రేకింగ్ సిస్టమ్ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
{{/usCountry}}ఈ యమహా సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ పర్ఫార్మెన్స్ గణాంకాలు, బ్యాటరీ సామర్థ్యం లేదా ఇది మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందనే అధికారిక వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. నిజానికి భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఎలక్ట్రిక్ స్పోర్ట్‌బైక్ రైడింగ్ అనుభవం ఎలా ఉంటుందో పరీక్షించడానికి, అలాగే పెట్రోల్ సూపర్ స్పోర్ట్స్ బైక్ ఇచ్చే హ్యాండ్లింగ్ ఫీలింగ్‌ను ఎలక్ట్రిక్ మోటార్ ఇచ్చే ఇన్‌స్టంట్ టార్క్‌తో మిళితం చేయడానికి మొదట ఈ ప్రోటో బీఈవీ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్ మోడల్ ఎప్పుడు పూర్తిస్థాయి ప్రొడక్షన్ బైక్‌గా మారి మార్కెట్లోకి వస్తుందో చూడాలి.