ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా.. భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ ‘యామహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్’ని అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో మంచి పాపులారిటీ ఉన్న ఎఫ్‌జెడ్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించారు. పెట్రోల్‌తో పాటు ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో కూడా ఈ బైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్తుంది.
సరికొత్త ఇంజన్ మార్పులు.. ఇథనాల్ పవర్!

యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లో రెగ్యులర్ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఉండే నమ్మకమైన 149 సీసీ, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా ఇందులో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ ఇంజన్ ఇప్పుడు 7,250 ఆర్‌పీఎమ్ వద్ద 11.7 హెచ్‌పీ పవర్‌ను, అలాగే 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే ఇందులో పవర్ 0.7 హెచ్‌పీ, టార్క్ 0.5 ఎన్ఎమ్ మేర తగ్గాయి. సాధారణంగా పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో ఇలాంటి స్వల్ప మార్పులు సహజమేనని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల సిటీ రైడింగ్‌లో పెద్దగా తేడా తెలియదని, ప్రయాణం ఎప్పటిలాగే సాఫీగా సాగుతుందని యామహా స్పష్టం చేసింది.
పాత హార్డ్‌వేర్.. కానీ బరువులో మార్పు!
యామహా తన ఐకానిక్ ఎఫ్‌జెడ్ డిజైన్ ఫార్ములాను ఇందులోనూ కొనసాగించింది. ఎఫ్‌జెడ్ రేవ్ మోడల్‌లో కనిపించే పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, మజిల్ లుక్ ఇచ్చే ఫ్యూయల్ ట్యాంక్, ఆకర్షణీయమైన ఎయిర్ వెంట్స్, సింగిల్-పీస్ సీటును అలాగే ఉంచారు. గరిష్ట నియంత్రణ కోసం 5-స్పీడ్ గేర్‌బాక్స్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, సింగిల్-ఛానల్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
అయితే, కొన్ని సాంకేతిక మార్పుల వల్ల బైక్ బరువు, గ్రౌండ్ క్లియరెన్స్‌లో మార్పులొచ్చాయి.
{{/usCountry}}అయితే, కొన్ని సాంకేతిక మార్పుల వల్ల బైక్ బరువు, గ్రౌండ్ క్లియరెన్స్‌లో మార్పులొచ్చాయి.
{{/usCountry}}ఈ బ్లూ ఫ్లెక్స్ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 ఎంఎంగా ఉంది. ఇది పాత వేరియంట్ల (165 ఎంఎం) కంటే తక్కువ.
ఫ్లెక్స్-ఫ్యూయల్ కిట్ కారణంగా ఈ బైక్ బరువు 139 కిలోలకు చేరింది. అంటే ఎఫ్‌జెడ్ రేవ్ మోడల్ కంటే ఇది 3 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది.
లభ్యత, రంగులు..
ప్రస్తుతానికి ఈ యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ బైక్‌ని కేవలం 'మెటాలిక్ బ్లాక్' రంగులో మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ప్రారంభ దశలో భాగంగా యామహా ఈ మోడల్‌ను దేశంలోని ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే విక్రయించనుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, దిల్లీలలోని యామహాకు చెందిన ప్రీమియం ‘బ్లూ స్క్వేర్’ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ఇది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
మొత్తం తొమ్మిది మోడళ్లు ఉన్న యామహా ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఈ బ్లూ ఫ్లెక్స్ వేరియంట్ మధ్యస్థంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఇథనాల్ ఇంధన వాడకం విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో, పర్యావరణ స్పృహ కలిగి ఉండి, తక్కువ ఖర్చుతో సిటీ కమ్యూటింగ్ చేయాలనుకునే యువతకు ఈ బైక్ ఒక చక్కని ప్రత్యామ్నాయం కానుంది.