లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం సాక్షిగా ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది! రన్ మెషిన్, కింగ్ కోహ్లీ కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ‘డకౌట్’గా వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసిన 140.4 కిలోమీటర్ల వేగంతో కూడిన ఇన్‌స్వింగర్, కోహ్లీని బోల్తా కొట్టించింది. బంతి వికెట్లను ఎగురగొట్టిన తీరు చూసి కోహ్లీతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ప్రిన్స్ యాదవ్ ‘మాయాజాలం’.. కోహ్లీ బలి!

లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ వేసిన ఆ డెలివరీ ఒక పక్కా ప్లాన్‌లా సాగింది. 1.4 డిగ్రీల మేర స్వింగ్ అయిన ఆ బంతి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌ని షాట్ ఆడేలా ప్రేరేపించింది. అయితే, బంతి అనూహ్యంగా లోపలికి రావడంతో కోహ్లీ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి దూసుకెళ్లి ఆఫ్-స్టంప్‌ను గాల్లోకి ఎగురగొట్టింది.
వికెట్ పడగానే ప్రిన్స్ యాదవ్ గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకోగా, కోహ్లీ నిరాశగా పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. స్టేడియం మొత్తం నిశ్శబ్ధం అలుముకుంది.
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ డకౌట్ అవ్వడం అంటే అది ప్రత్యర్థి జట్టుకు పండగే. ముఖ్యంగా కోహ్లీ సున్నాకి ఔట్ అవ్వడం 1110 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత (చివరిగా 2023లో రాజస్థాన్ రాయల్స్‌పై) ఇదే తొలిసారి.
మిచెల్ మార్ష్ విధ్వంసం.. లక్నో భారీ స్కోరు
అంతకుముందు టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించినప్పటికీ, రన్ రేట్‌లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. ఓపెనర్ మిచెల్ మార్ష్ కేవలం 56 బంతుల్లోనే 111 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇందులో 9 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్ (38), చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి స్కోరును 209 పరుగుల భారీ స్థాయికి చేర్చారు.
అయితే వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. డీఎల్ఎస్ని ఉపయోగించి టార్గెట్‌ని 213గా నిర్ణయించారు.
పోరాడి ఓడిన ఆర్సీబీ..
{{/usCountry}}అయితే వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. డీఎల్ఎస్ని ఉపయోగించి టార్గెట్‌ని 213గా నిర్ణయించారు.
పోరాడి ఓడిన ఆర్సీబీ..
{{/usCountry}}213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లీ వికెట్ రూపంలో మొదట్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ 31 బంతుల్లో 61 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినా, మిగిలిన బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 203 పరుగులకే పరిమితమై, ఓటమిని చవిచూసింది.
లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో నిలిచారు. షాబాజ్ అహ్మద్ కూడా రెండు కీలక వికెట్లు తీసి బెంగళూరును కట్టడి చేశారు.
తాజా మ్యాచ్‌లో ఓటమి తర్వాత కూడా ఆర్సీబీ 3వ స్థానంలో కొనసాగుతోంది. ఎల్ ఎస్జీ 10వ స్థానంలో ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో చివరిసారిగా ఎప్పుడు డకౌట్ అయ్యారు?
కోహ్లీ చివరిసారిగా 2023 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యారు. దాదాపు 1110 రోజుల తర్వాత ఆయన మళ్లీ సున్నాకే వెనుదిరిగారు.
2. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అత్యధిక పరుగులు చేసింది ఎవరు?
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
3. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ ఎక్కడ జరిగింది?
ఈ ఉత్కంఠభరిత పోరు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది.