దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో యువత పాత్ర నాటికంటే నేడు మరింత కీలకంగా మారింది. వివిధ రకాల ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు, ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న నేటి యువతరం ఆర్థిక సేవలను విస్తృతంగా వినియోగించుకుంటోంది. తొలిసారిగా బ్యాంకు ఖాతా తెరవడం, డిజిటల్ లావాదేవీలు జరపడం నుంచి మొదలై... తమ మొదటి రుణం తీసుకునే నాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. పటిష్టమైన ఆర్థిక భవిష్యత్తుకు ఈ మార్పు ఎంతగానో తోడ్పడుతుందని సీఆర్‌ఐఎఫ్ (CRIF) ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సేథ్ వెల్లడించారు.
విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు.. ఆర్థిక పరిపుష్టి

గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించడం, డిజిటల్ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు, తొలిసారి రుణాలు పొందే యువతకు బ్యాంకింగ్ అనుసంధానం పెరిగింది. అయితే, కేవలం బ్యాంకు ఖాతా తెరవడంతోనే ఆర్థిక చేరిక (Financial Inclusion) ప్రక్రియ పూర్తయిపోదు. లభించే ఆర్థిక సేవలను సరిగ్గా అర్థం చేసుకుని, సరైన ఇన్వెస్ట్‌మెంట్, రుణ నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన ఆర్థిక ప్రగతికి సంకేతం.
ఈ దిశగా వివిధ రకాల ఆర్థిక సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు తమ సుదీర్ఘ శాఖల నెట్‌వర్క్ ద్వారా పట్టణాలు, గ్రామాల్లో సేవలు అందిస్తుండగా.. కోఆపరేటివ్ బ్యాంకులు స్థానిక స్థాయి అవసరాలను తీరుస్తున్నాయి. మరోవైపు, ప్రైవేట్ బ్యాంకులు, డిజిటల్ లెండర్లు సాంకేతికతతో వేగవంతమైన సేవలు ఇస్తుండగా, ఎన్బీఎఫ్‌సీలు (NBFCs), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలకు క్రెడిట్ సదుపాయాన్ని చేరవేస్తున్నాయి.
తొలి రుణం.. సుదీర్ఘ ఆర్థిక ప్రయాణానికి పునాది
వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్నత చదువులు, వ్యక్తిగత అవసరాలు లేదా వాహనాల కొనుగోలుకు యువత రుణాలు తీసుకుంటోంది. ఒక వ్యక్తి తొలిసారి తీసుకునే రుణం వారి సుదీర్ఘ ఆర్థిక ప్రయాణానికి నాంది పలుకుతుంది. ఆ రుణాన్నీ వారు నిర్వహించే తీరే భవిష్యత్తులో ఇతర ఆర్థిక ప్రయోజనాలు లేదా రుణాలు పొందే అర్హతను నిర్ణయిస్తుంది.
అందుకే బాధ్యతాయుతమైన రుణ స్వీకరణ అత్యంత ఆవశ్యకంగా మారింది. రుణ నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి (Repayment Capacity) అనుగుణంగానే అప్పు తీసుకోవడం, వాయిదాలను సమయానికి చెల్లించడం వల్ల మంచి క్రెడిట్ ప్రొఫైల్ రూపుదిద్దుకుంటుంది. రోజువారీగా తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి.
డిజిటల్‌తో పెరిగిన అవగాహన
{{/usCountry}}అందుకే బాధ్యతాయుతమైన రుణ స్వీకరణ అత్యంత ఆవశ్యకంగా మారింది. రుణ నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి (Repayment Capacity) అనుగుణంగానే అప్పు తీసుకోవడం, వాయిదాలను సమయానికి చెల్లించడం వల్ల మంచి క్రెడిట్ ప్రొఫైల్ రూపుదిద్దుకుంటుంది. రోజువారీగా తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి.
డిజిటల్‌తో పెరిగిన అవగాహన
{{/usCountry}}పాత తరాలతో పోలిస్తే నేటి యువతకు ఆర్థిక సమాచారం సులభంగా అందుతోంది. వివిధ డిజిటల్ వేదికల ద్వారా వేర్వేరు రుణ ఉత్పత్తులను పోల్చి చూసుకోవడం, క్రెడిట్ స్కోర్ ప్రాధాన్యం తెలుసుకోవడం పెరిగింది.
క్రెడిట్ బ్యూరోలు, ఆర్థిక సంస్థలు కూడా బాధ్యతాయుతమైన రుణాల పెంపకంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాయి. రుణం అంటే కేవలం అవసరానికి డబ్బు పొందడమే కాదని, దానిని క్రమశిక్షణతో నిర్వహించడమే అసలైన బాధ్యత అని యువత గ్రహిస్తోంది.
భారతదేశంలో కేవలం ఆదాయం సంపాదించడమే ఆర్థిక స్వాతంత్య్రం కాదు. డబ్బును తెలివిగా నిర్వహించడం, రుణాలను సమర్థవంతంగా మేనేజ్ చేయడం ద్వారానే సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు సాధ్యమవుతుంది. ప్రారంభంలోనే అలవడే మంచి ఆర్థిక అలవాట్లు యువతను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తాయి.