Vaibhav Sooryavanshi: నో కేక్ కటింగ్.. ఓన్లీ బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ క్రమశిక్షణకు ఫిదాా.. వండర్ కిడ్ సక్సెస్ మంత్ర

Vaibhav Sooryavanshi: బర్త్ డే వచ్చిందంటే చాలు 15 ఏళ్ల కుర్రాళ్లు గంతులేస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం డిఫరెంట్. అతని డిసిప్లేన్ వేరే లెవల్. అందుకే బ్యాటింగ్ లో రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా అతను బర్త్ డే రోజు ఏం చేశాడో తెలుసా?

Published on: Mar 31, 2026 9:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ వజ్రం వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మైదానంలో అతను చూపించిన ఈ విధ్వంసకర బ్యాటింగ్ వెనుక కఠినమైన క్రమశిక్షణ దాగి ఉంది. ఈ అంకితభావమే అతడిని అతిచిన్న వయసులోనే ఐపీఎల్ స్టార్‌గా మార్చిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ (PTI)
వైభవ్ సూర్యవంశీ (PTI)

బర్త్‌డే వేడుకలకు నో

మార్చి 27న వైభవ్ తన 15వ ఏట అడుగుపెట్టినా బర్త్ డే వేడుకల కంటే ఆటకే ప్రాధాన్యత ఇచ్చాడు. "కేక్ కటింగ్ ఉండాల్సింది, కానీ నా మొహానికి కేక్ పూయించుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం త్వరగా నిద్రపోవాలని అనుకున్నా. అందుకే కేక్ కట్ చేయలేదు" అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ చిన్న వయసులో వైభవ్ చూపిన అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పవర్‌ప్లేలో పక్కా ప్లాన్

ఐపీఎల్ 2026లో సోమవారం (మార్చి 30) రాత్రి మ్యాచ్ లో సీఎస్కే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ పక్కాగా ప్లాన్ అమలు చేశాడు. పవర్‌ప్లేలోనే జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 305.88 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చేసింది. పవర్‌ప్లేలో బౌలర్లపై ఒత్తిడి తెచ్చి మ్యాచ్‌ను ఏకపక్షం చేయడంలో వైభవ్ వ్యూహం పూర్తిగా సక్సెస్ అయింది.

జైస్వాల్, కోచ్‌ల భరోసా

ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ తనకు మైదానంలో నిరంతరం మద్దతు ఇస్తున్నాడని వైభవ్ తెలిపాడు. ప్రతి బంతి తర్వాత జైస్వాల్ గైడ్ చేస్తూ, ఎప్పుడు షాట్లు ఆడాలో సూచిస్తున్నాడని వెల్లడించాడు. కోచ్‌లు కూడా తన సహజమైన ఆటను ఆడమని ప్రోత్సహిస్తూ తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు తన బ్యాట్‌తోనే అందరి విమర్శలకు సమాధానం చెబుతూ దూసుకుపోతున్నాడు.

గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 2026ను రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీతో మొదలెట్టింది. సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 128 పరుగుల ఛేజింగ్ ను కేవలం 12.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 17 బాల్స్ లోనే 52 రన్స్ కొట్టాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ లో వైభవ్ కు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఓవరాల్ గా ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More