జింబాబ్వే క్రికెట్ టీమ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో మొన్న ఆస్ట్రేలియా, ఇప్పుడు శ్రీలంకలను ఓడించింది. గురువారం (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. గ్రూప్ బి నుంచి నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలు, ఒక మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో సూపర్ 8లోకి దూసుకెళ్లింది.
జింబాబ్వే సంచలనం

జింబాబ్వే క్రికెట్ టీమ్ 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు కనీసం అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా సూపర్ 8కు వెళ్లి సంచలనం సృష్టించింది. అది కాకుండా మొదట ఆస్ట్రేలియా, తర్వాత శ్రీలంకలను చిత్తు చేసి అసలు ఓటమెరగని జట్టుగా నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 179 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. టీ20 క్రికెట్ లో జింబాబ్వేకు ఇది రెండో అత్యధిక చేజింగ్ కావడం విశేషం.
ఓపెనర్ బెన్నెట్ 48 బంతుల్లోనే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ సికందర్ రజా కూడా 26 బంతుల్లో 45 రన్స్ చేయడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 రన్స్ చేసి ఆరు వికెట్లతో విజయం సాధించింది.
శ్రీలంక ఇన్నింగ్స్ ఇలా..
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కుశాల్ మెండిస్ కూడా క్రీజులో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో శ్రీలంక బ్యాటర్లు భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు.
అయితే ఇన్నింగ్స్ చివర్లో పవన్ రత్నాయకే కేవలం 25 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జింబాబ్వే బౌలర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, గ్రేమ్ క్రీమర్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. సూపర్ 8లో భాగంగా జింబాబ్వే టీమ్ ఫిబ్రవరి 26న టీమిండియాతో తలపడనుంది. ఆ టీమ్ ఫామ్ చూస్తుంటే.. సూర్యకుమార్ సేన వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.
{{/usCountry}}అయితే ఇన్నింగ్స్ చివర్లో పవన్ రత్నాయకే కేవలం 25 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జింబాబ్వే బౌలర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, గ్రేమ్ క్రీమర్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. సూపర్ 8లో భాగంగా జింబాబ్వే టీమ్ ఫిబ్రవరి 26న టీమిండియాతో తలపడనుంది. ఆ టీమ్ ఫామ్ చూస్తుంటే.. సూర్యకుమార్ సేన వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.
{{/usCountry}}