...
...
Next Story

IRCTC Coastal Karnataka Tour Package : హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ... ఈ పుణ్యక్షేత్రాలను చూడొచ్చు! పూర్తి వివరాలు

IRCTC Coastal Karnataka Tour Package : ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఉడిపి, మురుడేశ్వర్, శృంగేరి, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాలను సందర్శించుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Oct 11, 2026, 10:38:34 IST
Advertisement
<p>కోస్తా కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు, భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. </p>

కోస్తా కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు, భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

'కోస్టల్ కర్ణాటక' (Coastal Karnataka) పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీ కోడ్ SHR085. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర సికింద్రాబాద్ సమీపంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రాబోయే యాత్ర 2026 అక్టోబర్ 20 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ ద్వారా ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, మురుడేశ్వర్, శృంగేరి శారదాంబ పీఠం, హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం, కొల్లూరు మూకాంబిక ఆలయం, గోకర్ణ మహాబలేశ్వర స్వామి ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటి ప్రసిద్ధ దివ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

ఫస్ట్ డే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు రైలు నంబర్ 12789 (కాచేగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) లో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 09:15 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనంలో ఉడుపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రికి ఉడుపిలోనే బస ఉంటుంది.

మూడో రోజు (గురువారం) ఉదయాన్నే గోకర్ణకు బయలుదేరి అక్కడ మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ ఆలయాన్ని, కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనాల తర్వాత తిరిగి ఉడుపి చేరుకుని రాత్రి బస చేస్తారు.

నాలుగో రోజు (శుక్రవారం) ఉడుపి హోటల్ చెకౌట్ చేసి హొరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాక శృంగేరికి చేరుకుని శ్రీ శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఐదో రోజు (శనివారం) హోటల్ చెకౌట్ చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్తారు. దర్శనం ముగించుకుని తిరిగి మంగళూరు చేరుకుంటారు. సాయంత్రం 19:00 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుని, రాత్రి 20:00 గంటలకు రైలు నంబర్ 12790 ద్వారా తిరుగు ప్రయాణమవుతారు. ఆరో రోజు (ఆదివారం) రాత్రి 23:40 గంటలకు కాచేగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది

రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3AC), ఏసీ వాహనంలో రవాణా, 3 రాత్రుల హోటల్ బస, 3 రోజులు ఉదయం అల్పాహారం (Breakfast), ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్-పార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ ఈ ప్యాకేజీలోనే కలిసి ఉంటాయి. మధ్యాహ్న, రాత్రి భోజనాలు, రైలులోని ఆహారం, ఆలయాల వద్ద ప్రవేశ టికెట్లు, పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి వ్యక్తిగత ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్ ధరలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks