...
...
Next Story

Heart attack : భారతీయులను వణికిస్తున్న గుండెపోటు! 30ఏళ్లకే హార్ట్ అటాక్- అసలు కారణాలు..

తక్కువ వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 30, 40 ఏళ్ల వయసువారే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు! దీనికి ప్రధాన కారణాలు, ముందస్తు నివారణ చర్యలపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 14, 2026, 13:55:47 IST
Advertisement
<p>పదేళ్ల క్రితం ముప్పై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తికి గుండెపోటు రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ నేడు అది సర్వసాధారణంగా మారిపోయింది! భారతదేశంలోని ప్రతి ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోనూ ముప్పై, నలభై ఏళ్ల వయసున్న వారు తీవ్రమైన గుండె నొప్పులు, కార్డియాక్ అరెస్ట్‌లతో చేరడం కార్డియాలజిస్టులు నిత్యం చూస్తున్నారు. వైట్ లోటస్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, హార్ట్‌నెట్ ఇండియా క్లినికల్ అడ్వైజర్ డాక్టర్ విజయ్ డి సిల్వా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ యువ వయసులోనే పెరుగుతున్న ముప్పుకు అసలు కారణాలను విశ్లేషించారు.</p>

పదేళ్ల క్రితం ముప్పై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తికి గుండెపోటు రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ నేడు అది సర్వసాధారణంగా మారిపోయింది! భారతదేశంలోని ప్రతి ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోనూ ముప్పై, నలభై ఏళ్ల వయసున్న వారు తీవ్రమైన గుండె నొప్పులు, కార్డియాక్ అరెస్ట్‌లతో చేరడం కార్డియాలజిస్టులు నిత్యం చూస్తున్నారు. వైట్ లోటస్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, హార్ట్‌నెట్ ఇండియా క్లినికల్ అడ్వైజర్ డాక్టర్ విజయ్ డి సిల్వా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ యువ వయసులోనే పెరుగుతున్న ముప్పుకు అసలు కారణాలను విశ్లేషించారు.

అధిక పనిభారం, నిరంతర మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వంటివి నేడు లక్షలాది మంది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయని డాక్టర్ విజయ్ పేర్కొన్నారు. అధిక ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటివే 30-40ఏళ్లు గల భారతీయుల్లో గుండెపోట్లు రావడానికి ప్రధాన కారణాలని ప్రముఖ కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

"దక్షిణాసియా ప్రజలకు కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే జన్మపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో ఈ సమస్య 5 నుంచి 10 ఏళ్ల ముందే కనిపిస్తుంది," అని డాక్టర్ విజయ్ స్పష్టం చేశారు. చాలా తక్కువ శరీర బరువు ఉన్నప్పటికీ భారతీయులు ప్రమాదకర కొవ్వును (విసెరల్ అడిపోస్ టిష్యూ) నిల్వ చేసుకునే ధోరణి కలిగి ఉంటారని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అందుకే సాధారణ శరీర బరువు ఉన్న వ్యక్తికి కూడా గుండె జబ్బుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

"నాకు గుండె జబ్బు రావడానికి ఇంకా చాలా చిన్న వయసు" అనే అపోహే చాలా మందిలో అతిపెద్ద భ్రమగా మారుతోంది. ఈ ఆలోచనే గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలను గుర్తించకుండా చేస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, ధూమపానం, ఊబకాయం, విపరీతమైన ఒత్తిడి ఉన్నవారు 20 ఏళ్ల వయసు నుంచే గుండె పరీక్షలు చేయించుకోవడం ప్రారంభించాలి.

రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొవ్వు పదార్థాల (లిపిడ్స్) స్థాయిలతో పాటు నడుము చుట్టుకొలతను కొలవడం వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే ఈసీజీ స్క్రీనింగ్ ద్వారా గుండెపోటు రావడానికి సంవత్సరాల ముందే ముప్పును గుర్తించి నివారించవచ్చు. యువ భారతీయుల్లో గుండెపోట్లు పెరగడమే అసలు సమస్య కాదు, చాలా మంది ఆ హెచ్చరికలను గుర్తించలేకపోవడమే అసలైన ప్రమాదం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe