మకర రాశిలో రాహువు సంచారం జ్యోతిష్య ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత, ఛాయా గ్రహమైన రాహువు శని అధిపతి అయిన మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య గణనల ప్రకారం, ఈ కీలక సంచారం డిసెంబర్ 5, 2026న ప్రారంభమై, జూన్ 22, 2028 వరకు కొనసాగుతుంది. దాదాపు ఏడాదిన్నర పాటు ఒకే రాశిలో ఉండే ఈ గోచార ప్రభావం మకర రాశి జాతకుల జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
కెరీర్ విజయాలు - ఆకస్మిక లాభాలు

శని క్షేత్రమైన మకరంలో రాహువు ప్రవేశం ఈ రాశి వారికి వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు ఖరారయ్యే సూచనలున్నాయి.
అలాగే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ డీల్స్ ఈ కాలంలో ఫైనల్ అవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. భౌతిక సుఖసౌకర్యాలు పెరిగి, ఆర్ధికంగా బలపడతారు.
మకర రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
మకర రాశి వారికి శని సాడేసాతి ప్రభావం ముగిసినప్పటికీ, రాహువు సంచార కాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నెగెటివ్ ఎనర్జీకి ప్రతీక.
ఆవేశానికి దూరంగా ఉండండి: రాహు ప్రభావం వల్ల చిన్న విషయాలకే కోపం రావడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరగవచ్చు. ఏ నిర్ణయమైనా ఆచితూచి వ్యవహరించాలి.
మానసిక ప్రశాంతత: అనవసరంగా ఎక్కువగా ఆలోచించి (Overthinking) టెన్షన్ పడకండి. ప్రశాంతంగా వుండండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
{{/usCountry}}మానసిక ప్రశాంతత: అనవసరంగా ఎక్కువగా ఆలోచించి (Overthinking) టెన్షన్ పడకండి. ప్రశాంతంగా వుండండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
{{/usCountry}}1. రాహువు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు?
డిసెంబర్ 5, 2026న రాహువు మకర రాశిలోకి ప్రవేశించి, జూన్ 22, 2028 వరకు అదే రాశిలో సంచరిస్తాడు.
2. మకర రాశి వారికి రాహు సంచారం వల్ల ఏ రంగాల్లో లాభం ఉంటుంది?
కెరీర్, ఆస్తి కొనుగోళ్లు, చరాస్తుల వృద్ధి, వివాహ ప్రయత్నాలు మరియు సమాజంలో గౌరవ మన్ననలు లభించడంలో ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.
ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని మేము చెప్పాము. వివరమైన మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.