ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం - ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

శనిదేవుడు మీన రాశిలో, తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచరిస్తున్నాడు. 2027 ఫిబ్రవరి 8 వరకు కొనసాగే ఈ శక్తివంతమైన సంచారంతో ఏ 6 రాశులకు అదృష్టం కలిసొస్తుందో, ఏ 4 రాశులు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

Published on: Nov 15, 2026, 07:52:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడి కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కర్మఫల దాతగా పిలిచే శని తన వేగాన్ని లేదా స్థానాన్ని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశులపై ఆ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు మీన రాశిలో ఉంటూ, తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు.

अगले 86 दिन 6 राशियों की लाइफ में खुशियां
अगले 86 दिन 6 राशियों की लाइफ में खुशियां

హిందూ పంచాంగం ప్రకారం…. ఈ నక్షత్ర సంచారం 2027 ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి పరిధిలోకి వస్తుంది. మీన రాశిలో శని ఉంటూనే, తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్ర రీత్యా అత్యంత శక్తివంతమైన పరిణామంగా జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.

"ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం దాదాపు ఆరు రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మరో నాలుగు రాశుల వారు మాత్రం రాబోయే 86 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి," అని ప్రముఖ జ్యోతిష్య పండితుడు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. శనిదేవుడి ఈ ప్రత్యేక సంచారం వల్ల కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ప్రేమ జీవితంలో ఎవరికి ఎలాంటి మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం.

అదృష్టం వరించే 6 రాశులు ఇవే

  • కుంభ రాశి : శనిదేవుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది. ఊహించని మార్గాల ద్వారా ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కెరీర్ పరంగా శుభవార్తలు అందుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.
  • మిథున రాశి : ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం మిథున రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. సంపాదన పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం.
  • కన్యా రాశి : కన్యా రాశి వారి జీవితంలో ఈ శని సంచారం కొత్త సంతోషాలను నింపుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. దాంపత్య జీవితంతో పాటు ప్రేమ వ్యవహారాలు కూడా సాఫీగా, ఆనందంగా సాగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • తులా రాశి : తులా రాశి వారికి శనిదేవుడు అత్యంత సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాడు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
  • వృషభ రాశి : వృషభ రాశి వారికి శని సంచారం వల్ల జీవితంలో కష్టాలు, అడ్డంకులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో నవ్వులు, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
  • మకర రాశి : మకర రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. పొదుపు చేసే అవకాశాలు మెరుగవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు.

ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి….

శనిదేవుడి నక్షత్ర సంచారం అన్ని రాశులకు ఒకేలా ఉండదు. పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం….. ధనుస్సు, కర్కాటక, సింహ, మేష రాశుల వారికి రాబోయే 86 రోజులు కాస్త క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ నాలుగు రాశుల వారు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం, ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి.

శని యొక్క నక్షత్ర రాశి సంచారం నుండి ఏ రాశిచక్రం అప్రమత్తంగా ఉండాలి? పండిట్ జీ ప్రకారం, శని యొక్క నక్షత్ర సంచారం ధనుస్సు, కర్కాటక, సింహం మరియు మేష రాశి ప్రజలకు కష్ట సమయాలను తెస్తుంది. ఈ రాశిచక్ర సంకేతాలు శని సంచార సమయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More