మీనంలో శని.. ఈ 5 రాశుల వారికి రాబోయే రోజులు అత్యంత కీలకం!
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడి సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో వక్ర సంచారంలో ఉన్న శని ప్రభావం వృషభ, కన్య, ధనుస్సు, మీన, మిథున రాశుల వారిపై ఏ విధంగా ఉండనుందో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కర్మఫల ప్రదాతగా పిలిచే శని దేవుడు చేసే ప్రతి కదలిక మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆయన ఏ భావంలో, ఏ రాశిలో సంచరిస్తున్నారనే దానిపై ఆయా జాతకుల ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నారు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం, మీన రాశిలో ఉన్న శని దృష్టి మూడవ, ఏడవ, పదవ స్థానాలపై పడుతుంది. ఈ ప్రత్యేక దృష్టి ప్రభావంతో పాటు, కొన్ని రాశులపై శని సంచార ప్రభావం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ కాలం కెరీర్, ఆర్థిక అంశాలు, కుటుంబ జీవితం పరంగా ఎంతో కీలకమని చెప్పవచ్చు. డిసెంబర్ 11, 2026 వరకు శని తన గమనాన్ని మార్చుకునే వరకు ఈ రాశుల వారు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని మూడవ దృష్టి పడుతుండటంతో ఉద్యోగ రంగంలో అనేక కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. అయితే, ఏవైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం లేదా బాగా ఆలోచించడం చాలా ముఖ్యం. నిరంతర శ్రమతో అనుకూల ఫలితాలను సాధించవచ్చు.
కన్యా రాశి:
కన్యా రాశిపై శని ఏడవ దృష్టి పడుతోంది. ఈ కారణంగా బంధాలు, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాల్లో అడుగులు జాగ్రత్తగా వేయాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం మంచిది కాదు. ఉద్యోగస్తులపై బాధ్యతల భారం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం ద్వారా అనవసర మనస్పర్థలను తొలగించుకోవచ్చు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శని పదవ దృష్టి ప్రభావం ఉంటుంది. ఇది ప్రధానంగా కర్మ స్థానం, ఉద్యోగ రంగంపై ప్రభావం చూపుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి రావచ్చు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు దక్కే సమయం ఆసన్నమైంది. అయితే పూర్తి విజయం సాధించడానికి ఓపిక, కష్టపడే తత్వం తప్పనిసరి.
మీన రాశి:
నేరుగా మీన రాశిలోనే శని దేవుడు సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని మధ్య దశ నడుస్తోంది. ఈ సమయంలో ప్రతి నిర్ణయంలోనూ, ప్రవర్తనలోనూ ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్థిక లావాదేవీల్లో అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలి. కుటుంబంతో ప్రశాంతంగా సమయం గడపడంతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
మిథున రాశి:
మిథున రాశికి పదవ భావంలో శని సంచారం జరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో పదవ భావాన్ని కీర్తి, ప్రతిష్టలు, ఉద్యోగానికి సంకేతంగా భావిస్తారు. ఈ రాశి వారు తమ వృత్తి జీవితంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు మీ భుజస్కంధాలపై పడతాయి. నూతన వ్యాపార ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయమే అయినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
ప్రస్తుతం మీన రాశిలో వక్రగతిలో ఉన్న శని దేవుడు డిసెంబర్ 11, 2026 నాడు తిరోగమనం కానున్నారు. అంటే ఆయన తన సాధారణ ప్రత్యక్ష గమనాన్ని ప్రారంభిస్తారు. శని తిరోగమనం అయిన తర్వాత ఉద్యోగ రంగంలో, అలాగే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


