...
...
Next Story

2026 బతుకమ్మ పండుగ: అక్టోబర్ 10 నుంచి 18 వరకు 9 రోజులు.. ఏ రోజు ఏ బతుకమ్మ? నైవేద్యాలు ఏమిటి?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను 2026లో అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజూ ప్రత్యేకమైన బతుకమ్మను పూలతో అలంకరించి, ఆ రోజుకు సంబంధించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ.

Published on: Sep 23, 2026, 11:00:36 IST
Advertisement

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ త్వరలోనే రాబోతోంది. మహిళల ఆత్మీయత, ప్రకృతి ప్రేమ, భక్తి, సాంస్కృతిక వైభవాన్ని బతుకమ్మ చాటుతుంది. 2026లో బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 18 వరకు 9 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన బతుకమ్మను తయారు చేస్తారు. అలాగే, ఆ రోజుకి తగ్గట్టుగా నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. తరతరాలుగా ఆనవాయితీగా తెలంగాణలో బతుకమ్మను జరుపుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ సంప్రదాయంలో ముఖ్యమైన భాగాలే.

బతుకమ్మ పండుగ.. ఏ రోజు ఎలా జరుపుకోవాలి?

2026 బతుకమ్మ పండుగ: అక్టోబర్ 10 నుంచి 18 వరకు 9 రోజులు.. ఏ రోజు ఏ బతుకమ్మ? నైవేద్యాలు ఏమిటి? (AI)
2026 బతుకమ్మ పండుగ: అక్టోబర్ 10 నుంచి 18 వరకు 9 రోజులు.. ఏ రోజు ఏ బతుకమ్మ? నైవేద్యాలు ఏమిటి? (AI)

అక్టోబర్ 10న ఎంగిలి బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న అటుకుల బతుకమ్మ, మూడవ రోజు అక్టోబర్ 12న ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు అక్టోబర్ 13న నానే బియ్యం బతుకమ్మ, అక్టోబర్ 14న అట్ల బతుకమ్మను నిర్వహిస్తారు. ఐదవ రోజు అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

అక్టోబర్ 15న అలిగిన బతుకమ్మ, అక్టోబర్ 16న వేపకాయల బతుకమ్మ, 17న వెన్నముద్దల బతుకమ్మను జరుపుకుంటారు. చివరి రోజు అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుతారు. సద్దుల బతుకమ్మ నాడు వివిధ రకాల సద్దులు, పిండివంటలను, ప్రసాదాలను అమ్మవారికి నివేదన చేస్తారు.

1వ రోజు అక్టోబర్ 10, 2026 ఎంగిలి పూల బతుకమ్మ

2వ రోజు అక్టోబర్ 11, 2026 అటుకుల బతుకమ్మ

3వ రోజు అక్టోబర్ 12, 2026 ముద్దపప్పు బతుకమ్మ

4వ రోజు అక్టోబర్ 13, 2026 నానబియ్యం బతుకమ్మ

5వ రోజు అక్టోబర్ 14, 2026 అట్ల బతుకమ్మ

6వ రోజు అక్టోబర్ 15, 2026 అలిగిన బతుకమ్మ

7వ రోజు అక్టోబర్ 16, 2026 వేపకాయల బతుకమ్మ

8వ రోజు అక్టోబర్ 17, 2026 వెన్నముద్దల బతుకమ్మ

9వ రోజు అక్టోబర్ 18, 2026 సద్దుల బతుకమ్మ

సాంప్రదాయ దుస్తుల్లో సంతోషంగా

మొదటి రోజు: ఎంగిలి పూల బతుకమ్మ నాడు నువ్వులు, బియ్యం పిండితో నైవేద్యాలు సమర్పిస్తారు.

రెండవ రోజు: అటుకులు, బెల్లం, ఉడికించిన పప్పుతో నైవేద్యాలను సమర్పిస్తారు.

మూడవ రోజు: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యాలను సమర్పిస్తారు.

నాలుగవ రోజు: పాలు, బెల్లం, నానే బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు.

ఐదవ రోజు: అట్లు పోసి అమ్మవారికి నివేదన చేస్తారు.

ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ. ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యం లేదు.

ఏడవ రోజు: బియ్యం పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

ఎనిమిదవ రోజు: వెన్న ముద్దలు, నువ్వులు, బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు.

తొమ్మిదవ రోజు: పప్పు, పెరుగు, బెల్లం మొదలైన వాటితో పదార్థాలను చేసి నివేదన చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks