రాహు నక్షత్రంలో శుక్రుడు - ఈ 4 రాశుల వారికి అక్టోబర్ 23 వరకు పట్టిందల్లా బంగారమే!
స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల అక్టోబర్ 23 వరకు 4 రాశుల జాతకం మారనుంది. వ్యాపారం, ఉద్యోగంలో ఊహించని ధనలాభాలు, శుభవార్తలు అందుతాయి.
జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు, అపారమైన ధనలాభం కలుగుతాయి. కేవలం రాశి మార్పు మాత్రమే కాకుండా…. శుక్రుడి నక్షత్ర సంచారం కూడా ద్వాదశ రాశుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుతం శుక్ర గ్రహం రాహువుకి చెందిన స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తోంది. వైదిక పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు, అక్టోబర్ 23 అర్ధరాత్రి వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. ఈ కాలంలో శుక్రుడి శుభ దృష్టి వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తలపు తడుతోంది. ఇవాళ్టి నుంచి రాబోయే 30 రోజుల పాటు ఈ రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఆ అదృష్ట రాశుల వివరాలు, వాటికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం.
కర్కాటక రాశి
తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడి ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా మారింది. వీరి ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి శుభవార్త ఈ సమయంలో మీ ఇంటి తలుపు తడుతుంది.
తులారాశి
సంపదలను ప్రసాదించే శుక్రుడు సొంత రాశి అయిన తులారాశిలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి రాజయోగాన్ని తలపించే ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా భారీ బోనస్ లేదా జీతం పెంపు పొందే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు, ఆనందం వెల్లివిరుస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశి అధిపతి కూడా శుక్రుడే కావడంతో, ఈ నక్షత్ర గోచారం వృషభ రాశి వారికి అత్యంత సానుకూల మార్పులను తీసికొని వస్తుంది. ప్రత్యేకించి వ్యాపార రంగానికి చెందిన వారికి ఇది ఒక సువర్ణ సమయం. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన కాలం. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని భావించవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాహు నక్షత్రంలో శుక్రుడి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండింటిలోనూ ఊహించని మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి, లాభాల బాట పడతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈ కాలం మీకు సంపూర్ణ యోగాన్ని ఇస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

