ఫిబ్రవరిలోని ఏకాదశులు 2026: ఈ ఏడాది మొదటి నెల పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి రాబోతోంది. ఫిబ్రవరిలోకి అడుగు పెట్టబోతున్నాము. ఏకాదశి ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. మొదట శుక్ల పక్షంలో వస్తుంది. తరవాత ఏకాదశి కృష్ణ పక్షంలో వస్తుంది. ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఈ ప్రత్యేక రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి నాడు నిష్టగా ఉపవాసాన్ని పాటిస్తే, విష్ణుమూర్తి ఖచ్చితంగా తన ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు.
ఫిబ్రవరిలోని ఏకాదశులు
విజయ ఏకాదశి

ఈ నెలలో వచ్చే ఏకాదశికి చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో రెండు ముఖ్యమైన ఏకాదశులు రానున్నాయి. మొదటిది విజయ ఏకాదశి, రెండవది అమలకి ఏకాదశి. ఈ ఏకాదశులు హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విజయ ఏకాదశి పేరులో ఉన్నట్లుగా, విజయం సాధించడానికి అవకాశం ఇస్తుంది.
ఈ రోజున మనం నిష్టగా, మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి, విష్ణువుని ఆరాధిస్తే, ప్రతి ప్రతికూల విషయాన్ని జయించడం ద్వారా మనం సులభంగా ముందుకు సగచ్చు. అదే సమయంలో, అనేక రకాల అడ్డంకులు కూడా జీవితం నుండి తొలగిపోతాయి. పంచాంగం ప్రకారం, విజయ ఏకాదశి ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు రాబోతోంది.
విజయ ఏకాదశి 2026 శుభ సమయం: ఉదయం 6.26 నుండి 9.15 గంటల వరకు. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించాలి. భక్తితో విష్ణువుని ఆ రోజు ఆరాధిస్తే ఆనందంగా ఉండచ్చు, విజయాలు కలుగుతాయి.
అమలకి ఏకాదశి
ఫిబ్రవరి నెలలో కృష్ణ పక్షంలో ఈ అమలకి ఏకాదశి వస్తుంది. దీనిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ప్రత్యేక రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే చాలా ప్రయోజనాలు లభిస్తాయని కూడా నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం ద్వారా, ఇంట్లో ఆనందం ఉంటుంది. ప్రజలందరి ఆరోగ్యం బాగుంటుంది. అమలకి ఏకాదశి ఫిబ్రవరి 26న వచ్చింది.
అమలకి ఏకాదశి 2026 శుభ సమయం: ఆరాధనకు శుభ సమయం ఉదయం 6:15 నుండి 9:09 వరకు. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించాలి.
ఈ రెండు ఏకాదశులు వేళ ఏం చెయ్యాలి?
- ఉదయాన్నే స్నానం చేయాలి. వీలైతే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేయాలి.
- విష్ణువు చిత్రం లేదా విగ్రహం ముందు పసుపు పువ్వులను సమర్పించండి.
- ఈ రోజున, తులసిని విష్ణుమూర్తికి సమర్పించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
- తులసి మొక్కలో లక్ష్మీమాత నివసిస్తుంది. ఈ కారణంగానే ఇది విష్ణుమూర్తికి కూడా ప్రియమైనది.
- విజయ ఏకాదశి రోజున, మీరు పూజ గది దగ్గర ఒక కుండ నీటిని ఉంచాలి. అమలకి ఏకాదశి రోజున ఉసిరి మొక్కను పూజించడం మర్చిపోవద్దు. ఏకాదశి విచ్ఛిన్నం తర్వాత దానధర్మాలు చేయడం మంచిగా భావిస్తారు.
- పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.