...
...
Next Story

మార్చి మూడున చంద్ర గ్రహణం నాడు గర్భిణీలు ఈ తప్పులు చేయకూడదు.. పరిహారాలు, సూతక కాలం వివరాలు ఇవిగో

గ్రహణ సమయంలో చాలా మంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా గర్భిణీలు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ధ్యానం, భగవన్నామస్మరణతో సమయాన్ని కేటాయించడం మంచిది. అయితే మరి గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?

Published on: Feb 27, 2026, 16:31:16 IST
Advertisement

ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు (Lunar Eclipse) ఏర్పడడం చూస్తూ ఉంటాం. మార్చి నెలలో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనపడుతుంది. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత దానాలు చేయడం, గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేసుకోవడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.

మార్చి మూడున చంద్ర గ్రహణం నాడు గర్భిణీలు ఈ తప్పులు చేయకూడదు (pinterest)
మార్చి మూడున చంద్ర గ్రహణం నాడు గర్భిణీలు ఈ తప్పులు చేయకూడదు (pinterest)

గ్రహణ సమయంలో చాలా మంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా గర్భిణీలు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ధ్యానం, భగవన్నామస్మరణతో సమయాన్ని కేటాయించడం మంచిది. అయితే మరి గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణ సమయం ఎందుకు శుభప్రదమైనది కాదు?

గ్రహణ సమయంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం పడుతుంది. గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు స్వచ్ఛమైనవి కావు. కాబట్టి అనవసరంగా బయటకు వెళ్లడం వంటివి మంచిది కాదు.

గ్రహణ సమయంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి?

ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. సూదులు, కత్తి, కత్తెర వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే కుట్టడం, ఎంబ్రాయిడరీ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. పాజిటివ్ ఆలోచనలను కలిగి ఉండాలి.

ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి పరిహారాలను పాటించాలి?

మార్చి మూడున ఏర్పడే చంద్రగ్రహణం 20 నిమిషాల పాటు ఉంటుంది. సాయంత్రం 6:26కి ప్రారంభమై సాయంత్రం 6:46తో ముగుస్తుంది. ఈ 20 నిమిషాలు కూడా గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

సూతక కాలం

గ్రహణ సూతక కాలం ఉదయం 9:39కి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా గర్భిణీ స్త్రీలు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించడం వంటివి చేయకూడదు. అలాగే పూజలు వంటివి కూడా చేయకూడదు. ప్రయాణాలు చేయడం, పూజలు చేయడం వంటివి ఈ సమయంలో నిషిద్ధం.

అలాగే గర్భిణీలు కూరగాయలు కోయడం వంటివి కూడా చేయకుండా చూసుకోవాలి. ఆకాశం వైపు చూడడం కూడా మంచిది కాదు. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి సానుకూల ఆలోచనలను కలిగేలా చేసుకోవాలి. అలాగే ఇష్టమైన మంత్రాలను జపిస్తే కూడా ఉత్తమ ఫలితాలను పొందడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks