న్యూమరాలజీ (Numerology) ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ప్రతి సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. రాడిక్స్ సంఖ్యల ద్వారా భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది.
సూర్యుడి సంవత్సరం

మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం (Sun) కొన్ని సంఖ్యల వారికి బాగా కలిసి రాబోతోంది. పైగా కొత్త సంవత్సరం సూర్యుడు సంవత్సరం. కొత్త సంవత్సరం మూల సంఖ్య ఒకటి, పాలక గ్రహం సూర్యుడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం చాలా మంది లాభాలను పొందబోతున్నారు. మరి ఏ రాడిక్స్ సంఖ్యల వారికి కొత్త సంవత్సరం కలిసి రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అదృష్ట సంఖ్యల్లో మీ సంఖ్య కూడా ఉందేమో చూసుకోండి.
ఈ రాడిక్స్ సంఖ్యల వారికి 2026 అదృష్ట సంవత్సరం.. కొత్త సంవత్సరంలో అనేక లాభాలను పొందుతారు
ముఖ్యంగా 2026 ఈ మూడు సంఖ్యల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. కెరీర్, విద్య, డబ్బు వంటి రంగాల్లో ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. సానుకూల మార్పులు కూడా వస్తాయి.
రాడిక్స్ సంఖ్య 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. రాడిక్స్ సంఖ్య 1 వారికి కొత్త సంవత్సరం జాక్‌పాట్ అని చెప్పొచ్చు. రాడిక్స్ సంఖ్య 1కి అధిపతి సూర్యుడు. శక్తి, బలం, నాయకత్వానికి ప్రతీక. డబ్బు, ఆస్తి పరంగా రాడిక్స్ సంఖ్య 1 వారికి కొత్త సంవత్సరం గొప్పగా ఉండబోతోంది. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. కొత్త ఇల్లు కొనాలని కలకనే వారికి ఈ సంవత్సరం వారి కలలు నెరవేరబోతున్నాయి. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు కూడా ఈ సంవత్సరం పూర్తవుతాయి.
పరిహారాలు:
రాడిక్స్ సంఖ్య 1 వారు ఉదయం స్నానం చేసిన తర్వాత రామ స్తుతిని మూడు సార్లు చేయండి. రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
రాడిక్స్ సంఖ్య 3
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 1 వారు ఉదయం స్నానం చేసిన తర్వాత రామ స్తుతిని మూడు సార్లు చేయండి. రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
రాడిక్స్ సంఖ్య 3
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 3 వారికి కూడా కొత్త సంవత్సరం కలిసి రాబోతోంది. ఈ సంఖ్యలో ఉన్నవారు అదృష్టాన్ని పొందుతారు. ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. మూడు సంఖ్యకు అధిపతి బృహస్పతి. కొత్త సంవత్సరంలో పెద్ద సానుకూల మార్పులు వస్తాయి. విద్య, కెరీర్‌లో కూడా బాగుంటుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. ఏడాది పొడవునా సూర్యుని సానుకూల ప్రభావంతో పాటు గురువు మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగం, పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది.
పరిహారాలు:
ఈ సంఖ్య ఉన్నవారు విష్ణుమూర్తిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది. జీవితంలో చక్కటి మార్పులను చూస్తారు.
రాడిక్స్ సంఖ్య 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. కెరీర్ బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగాలు మారితే కూడా ప్రయోజనం కలుగుతుంది. కెరీర్‌కు సంబంధించి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ట్రాన్స్‌ఫర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కనుక ఏడాది సరిగ్గా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి. తెలివిగా ఖర్చు చేస్తే అన్ని బాగుంటాయి. అనవసరమైన ఖర్చులు, రిస్క్ తీసుకోవద్దు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
పరిహారాలు:
రాడిక్స్ సంఖ్య 5 వారు ఆలయానికి వెళ్లి పరిమళ ద్రవ్యాలు, అగరబత్తీలు, గంధం వంటి వాటిని సమర్పించాలి. వీటిని సమర్పిస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.