గ్రహాల కాలానుగుణంగా వాటి రాశులను మార్చడం మనం చూస్తూ ఉంటాం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, గ్రహాల సంచారంలో మార్పు కొన్నిసార్లు రాజయోగాలను సృష్టిస్తుంది. ఏప్రిల్ నెలలో మూడు ప్రధాన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. ఈ రాజయోగాలు 12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలను తీసుకురానుంది. మరి ఏప్రిల్ నెలలో కలిగే రాజయోగాలు ఏవి, ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మూడు శక్తివంతమైన రాజయోగాలు

ఏప్రిల్ 2న త్రిగ్రాహి యోగం ఏర్పడిన విషయం తెలిసిందే. కుజ, శని, సూర్య గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడింది. ఇది కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 11న బుధుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో సూర్య, బుధ, శుక్ర, శని గ్రహాల కలయికతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. అదే విధంగా, సూర్య, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్య, కుజ గ్రహాల కలయికతో కుజ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది.
ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు ఏప్రిల్ 30న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ ఏప్రిల్ నెలలో ఏర్పడే రాజయోగాలు నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్ నెలలో మూడు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఏప్రిల్ నెల బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. ఉద్యోగస్తుల పని తీరు బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ సమయంలో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రశాంతత ఉంటుంది.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ శక్తివంతమైన యోగాల వలన కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. మొదట చిన్న ప్రారంభాలు కలిసి రాకపోయినా, ముందుకు వెళ్లే కొద్దీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
3.కుంభ రాశి:
{{/usCountry}}మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ శక్తివంతమైన యోగాల వలన కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. మొదట చిన్న ప్రారంభాలు కలిసి రాకపోయినా, ముందుకు వెళ్లే కొద్దీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
3.కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి శుభ సమయం. ఈ నెలలో ఈ రాశి వారి వ్యాపారంలో, కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలను పొందుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుని, సహనంతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
4.వృషభ రాశి:
వృషభ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది.