...
...
Next Story

4 Planets in Pisces: మీనరాశిలో నాలుగు గ్రహాల కలయిక.. కుజ అనుగ్రహంతో ఆర్థిక లాభాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పురోగతి!

మీనరాశిలో కుజుడు 40 నుంచి 45 రోజులు వరకు ఉంటాడు. మళ్లీ మీన రాశిలోకి కుజుడు రావడానికి 18 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తే, చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం ఒక్కసారిగా మారుతుంది.

Published on: Mar 20, 2026, 14:00:50 IST
Advertisement

4 Planets in Pisces గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచారంలో మారితే, అది అన్ని రాశులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో కుజుడు 40 నుంచి 45 రోజులు వరకు ఉంటాడు. మళ్లీ మీన రాశిలోకి కుజుడు రావడానికి 18 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు.

మీనరాశిలో కుజుడు

4 Planets in Pisces: మీనరాశిలో నాలుగు గ్రహాల కలయిక.. కుజ అనుగ్రహంతో ఆర్థిక లాభాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది (pinterest)
4 Planets in Pisces: మీనరాశిలో నాలుగు గ్రహాల కలయిక.. కుజ అనుగ్రహంతో ఆర్థిక లాభాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది (pinterest)

కుజుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తే, చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి, పురోగతిని చూస్తారు. ఉద్యోగాలు లభిస్తాయి.

వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. భూమి కొనడానికి తీసుకున్న నిర్ణయం విజయవంతం అవుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

కుజ సంచారంతో ఈ రాశులకు ఆర్థిక లాభాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పురోగతిని చూస్తారు

1.మేష రాశి:

మేష రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. కుజుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో నాలుగు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ యోగంతో ఈ రాశి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుకుంటారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.

ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా, ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.

2.వృశ్చిక రాశి:

పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూమి కొనడానికి తీసుకున్న నిర్ణయం విజయవంతం అవుతుంది. సానుకూల మార్పులను చూస్తారు. మీ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.

3.మీన రాశి:

మీన రాశి వారికి ఈ సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇల్లు, ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks