చాలా సమస్యల్ని తొలగించే విశేషమైన వ్రతం ఏడు శనివారాల వ్రతం. చాలా మంది ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేయడం వలన ఏడుకొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేయొచ్చు.

ఒకవేళ మధ్యలో ఆడవారికి ఇబ్బంది వస్తే ఆ వారం వదిలిపెట్టి ఇంకో వారం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. పురుషులు మాత్రం వ్రతాన్ని ఆచరిస్తే ఏడు వారాలు పాటు అంతరాయం లేకుండా చేసుకోవాలి. అయితే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సిన నియమాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఏడు శనివారాల వ్రతం
పూర్వం ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి స్వామివారిని ప్రార్థించాడు. స్వామి వారు కనికరించి సప్త శనివారాల వ్రతం ఆచరించమని చెప్పారు. బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా ఏడు శనివారాలు నియమనిష్టలతో పూజ చేసి తన ఆపదల నుంచి బయటపడ్డాడు. సుఖ సంతోషాలను పొందాడు. ఈ ఏడు శనివారాల వ్రత కథ చదువుకుని స్వామి వారిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని అందరి నమ్మకం.
ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సినవి తెలుసుకోండి
ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ఉదయం ఏం చేయాలి?
ఉదయాన్నే తలస్నానం చేయాలి. నల్లటి వస్త్రాలు, తిరునామం, తులసిమాల ధరించాలి. ఉదయం 6 నుంచి 7లోగా పూజ చేసుకోవాలి. ఏడు నువ్వుల ఉండలను చేసి నైవేద్యంగా పెట్టాలి.
{{/usCountry}}ఉదయాన్నే తలస్నానం చేయాలి. నల్లటి వస్త్రాలు, తిరునామం, తులసిమాల ధరించాలి. ఉదయం 6 నుంచి 7లోగా పూజ చేసుకోవాలి. ఏడు నువ్వుల ఉండలను చేసి నైవేద్యంగా పెట్టాలి.
{{/usCountry}}మధ్యాహ్నం భోజనం చేయకూడదు.
ఏడు పిండి ప్రమిదలు చేసి, ఏడు రంగుల వత్తులు వేసి దీపారాధన చేయాలి.
సాయంత్రం అతిథిని భోజనానికి ఆహ్వానించాలి. ఉదయం భోజనానికి పిలవక్కర్లేదు.
ఏడు శనివారాల వ్రతం ఆచరించేవారు ఉదయం కలశ స్థాపన చేసి పూజ చేసుకోవాలి.
వండిన పదార్థాలు ఉదయం పూట నైవేద్యంగా పెట్టక్కర్లేదు.
ఏడు అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా వెలిగించాలి.
వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రాలు, వెంకటేశ్వర అష్టోత్తరం, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణ చేసుకోవచ్చు.
ఏడు శనివారాల వ్రతం ఆచరించే వారు సాయంత్రం ఏం చేయాలి?
సాయంత్రం తలస్నానం చేయక్కర్లేదు. మామూలుగా స్నానం చేసి పసుపు వస్త్రాలు, తిరునామం, తులసిమాల ధరించాలి.
సాయంత్రం 6 నుంచి 7 గంటల లోగా వ్రతం చేసుకోవడం మంచిది. 7 శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
వ్రతం అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు.
ఏడు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి.
రెండు ప్రమిదల్లో 7 వత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. నువ్వుల నూనెతో ఈ దీపారాధన చేయాలి.
వ్రతమునకు అతిథిని ఆహ్వానించాలి.
అలాగే విశ్వక్సేనారాధన, షోడశోపచార పూజ, అధాంగ పూజ, వెంకటేశ్వర అష్టోత్తరం, లక్ష్మీ పద్మావతి అష్టోత్తరాలు చదువుకుని వెంకటేశ్వర స్వామికి హారతి, వ్రత కథ పారాయణ కూడా పూర్తి చేయాలి.
ఏడు అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా ఉదయంలాగే వెలిగించాలి. నైవేద్యం వండిన తర్వాత వండిన భోజన పదార్థాలతో నైవేద్యం పెట్టాలి. సాయంత్రం మళ్లీ కలశ స్థాపన చేయక్కర్లేదు. సాయంత్రం వ్రత విధానంతో పూజ చేయాలి.
వ్రతం అయిపోయిన తర్వాత వండిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి.