చాణక్య నీతి : మనిషిని కృంగదీసే 5 విషయాలు - వీటితో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Chanakya Niti Life Lessons Telugu : మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కృంగదీసే ఐదు పరిస్థితుల గురించి ఆచార్య చాణక్యుడు వివరించారు. ఈ ఐదు విషయాలు అగ్ని లేకుండానే మనిషిని లోపల కాల్చివేసి ఆనందం, శాంతిని దూరం చేస్తాయి.
Chanakya Niti Life Lessons Telugu : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో లోతైన విషయాలను విశ్లేషించారు. సమాజంలో మనిషి ఎలా జీవించాలి..? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా…. అగ్ని(మంటలు) లేకుండానే ఒక వ్యక్తిని లోపలి నుంచి కాల్చివేసే ఐదు భయంకరమైన పరిస్థితుల గురించి చాణక్యుడు హెచ్చరించారు.

చాణక్య నీతిలోని ఒక శ్లోకం ప్రకారం: "కాంతవియోగః స్వజనాపమానో.. రుణస్య శేషః కునృపస్య సేవా.." అంటే అగ్ని ప్రమేయం లేకుండానే శరీరాన్ని దహించే ఐదు శక్తులు ఇవి:
1. జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం (కాంతవియోగం)
భార్యాభర్తల మధ్య బంధం ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం…. జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం అనేది వ్యక్తికి అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఎడబాటు మనిషిని మానసికంగా కృంగదీసి, జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. అందుకే బంధాలలో చిన్న చిన్న పొరపాట్లను విస్మరించి, ప్రేమతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
2. ఆత్మీయుల ద్వారా అవమానం (స్వజనాపమానం)
బయటి వ్యక్తులు చేసే అవమానం కంటే, మన వారు అని నమ్మిన వారు లేదా కుటుంబ సభ్యులు చేసే అవమానం గుండెను లోతుగా గాయపరుస్తుంది. సన్నిహితుల నుంచి అవమానం ఎదురైనప్పుడు వ్యక్తి బతికి ఉన్నా మరణంతో సమానమైన వేదనను అనుభవిస్తాడని చాణక్యుడు పేర్కొన్నారు.
3. తీరని అప్పు (రుణ శేషం)
అప్పుల భారం మనిషిని పగలు, రాత్రి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండటం మనిషిని లోపల అగ్నిలా దహిస్తుంది. అందుకే శక్తికి మించి అప్పులు చేయవద్దని….. ఉన్న అప్పులను వీలైనంత త్వరగా తీర్చివేసి రుణవిముక్తులు కావాలని చాణక్య నీతి బోధిస్తోంది.
4. దుష్ట యజమాని (కునృపస్య సేవ)
పూర్వ కాలంలో అన్యాయం చేసే రాజుకు సేవ చేయడం శాపంగా భావించేవారు. నేటి కాలంలో దీన్ని తప్పుడు వ్యక్తి లేదా నైతిక విలువలు లేని సంస్థలో పని చేయడం అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి నిమిషం ఆత్మాభిమానం చంపుకుని పని చేయాల్సి రావడం మనిషిని మానసికంగా దహిస్తుంది.
5. దుష్టుల సాంగత్యం (ఖలజన సేవ)
చెడు ఆలోచనలు గలవారు, అసూయ పడేవారు మరియు ప్రతికూల ధోరణి కలిగిన వ్యక్తుల మధ్య ఉండటం మనశ్శాంతిని హరిస్తుంది. అగ్ని మనిషిని పైకి కాల్చితే, దుష్టుల సాంగత్యం మనిషి ఆలోచనలను విషపూరితం చేసి లోపలి నుంచి నాశనం చేస్తుంది.
పరిష్కారం ఏమిటి…?
ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే సంబంధాలలో మర్యాదను పాటించాలి. ఆర్థిక నిర్ణయాలలో వివేకంతో వ్యవహరించాలి. అన్నింటికీ మించి నైతిక విలువలను గౌరవించే వ్యక్తుల మధ్య నివసించడం నేర్చుకోవాలి. అంతర్గత ప్రశాంతత కోసం ధ్యానం, క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం కేవలం ప్రాచుర్యంలో ఉన్న గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం నిపుణులను సంప్రదించండి}
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

