Quote of the Day: చాణక్య నీతి.. ఈ మూడు తప్పులు చేస్తే మీ జీవితం నరకప్రాయం.. జాగ్రత్త!

Quote of the Day: జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో గౌరవం దక్కాలన్నా ఆచార్య చాణక్యుడి సూత్రాలు దిక్సూచిలా పనిచేస్తాయి. మనిషిని కుంగదీసే మూర్ఖత్వం నుంచి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరాయి ఇంటి నివాసం వరకు.. చాణక్యుడు హెచ్చరించిన ఆ ప్రమాదకరమైన తప్పుల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: Apr 29, 2026, 08:00:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Quote of the Day: గతంలోని చేదు జ్ఞాపకాలను, పాత బాధలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే అసలైన విజయం. మన మనస్సులో పేరుకుపోయిన ప్రతికూలతలను తొలగించుకున్నప్పుడే, కొత్త సంతోషాలకు చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో మనిషి పతనానికి దారితీసే 3 ప్రధాన కారణాలను వివరించారు.

Quote of the Day: చాణక్య నీతి.. ఈ మూడు తప్పులు చేస్తే మీ జీవితం నరకప్రాయం
Quote of the Day: చాణక్య నీతి.. ఈ మూడు తప్పులు చేస్తే మీ జీవితం నరకప్రాయం

మూర్ఖత్వం కష్టదాయకమైనది, యవ్వనం కూడా కష్టాలతో కూడుకున్నది. కానీ వీటన్నిటికంటే అత్యంత బాధాకరమైనది 'పరాయి ఇంటిపై ఆధారపడి జీవించడం'. ఈ ఒక్క శ్లోకంలో మనిషి తన జీవితంలో చేయకూడని అతిపెద్ద తప్పులను చాణక్యుడు విశ్లేషించారు.

1.మూర్ఖత్వం: అభివృద్ధికి అడ్డుగోడ

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మూర్ఖత్వం అనేది ఒక వ్యక్తికి ఎదురయ్యే అతిపెద్ద కష్టం. ఇక్కడ మూర్ఖత్వం అంటే చదువు లేకపోవడం కాదు, కనీస అవగాహన లేకపోవడం. మూర్ఖుడు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ, అనుభవజ్ఞులు చెప్పే మాటలను పెడచెవిన పెడతాడు. ఎదుటివారి మాటలకు త్వరగా ప్రభావితమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. తనలోని లోపాలను గుర్తించలేని వాడు జీవితాంతం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.

2.యవ్వనం: ఒక వెల్లువ.. అదుపు తప్పితే అనర్థం

సాధారణంగా యవ్వనం అంటే ఉత్సాహం, శక్తికి ప్రతీక. కానీ చాణక్యుడు దీనిని కూడా కష్టంగానే భావించారు. ఎందుకంటే, ఈ వయస్సులో మనిషి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవిత కాలం విషాదాన్ని మిగులుస్తాయి. కోపం, తొందరపాటు, తప్పుడు స్నేహాలు, అహంకారం యవ్వనాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ దశలో క్రమశిక్షణ, వివేకం లేని యౌవనం కేవలం కష్టాలను మాత్రమే మిగిలిస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత తమ శక్తిని చదువుపై, వృత్తిపై మరియు మంచి అలవాట్లపై కేంద్రీకరించినప్పుడే అది అర్థవంతంగా మారుతుంది.

3.పరాయి ఇంట్లో ఉండడం: అత్యంత దారుణం

పై శ్లోకంలో చాణక్యుడు అన్నిటికంటే పెద్ద కష్టంగా 'పరాయి ఇంట్లో నివసించడం' గురించి చెప్పారు. దీని అర్థం కేవలం ఇల్లు మారడం కాదు.. ఇతరులపై ఆర్థికంగా, మానసికగా ఆధారపడటం. ఎదుటివారి దయాదాక్షిణ్యాలపై బతకడం వల్ల మనిషి తన స్వేచ్ఛను, ఆత్మాభిమానాన్ని పూర్తిగా కోల్పోతాడు. ప్రతి నిర్ణయానికి ఎదుటివారి అనుమతి కోరడం, వారి ఇచ్చే అవమానాలను భరించడం నరకప్రాయంగా ఉంటుంది. "కష్టపడి అయినా సరే సొంత కాళ్ళ మీద నిలబడాలి," అని చాణక్యుడు చెప్పారు. స్వేచ్ఛ కంటే మించిన సుఖం ఈ ప్రపంచంలో మరేదీ లేదు.

సంతోషకరమైన జీవితానికి మార్గాలు

ఈ తప్పుల నుంచి బయటపడాలంటే నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించడం, యవ్వనంలో ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మన కష్టార్జితంతో మనమే బతకాలి అనే ఆత్మనిర్భరత ఉంటేనే సమాజంలో గౌరవం దక్కుతుంది. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు శతాబ్దాల నాటివైనా, నేటి ఆధునిక కాలంలో కూడా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. వివేకం, క్రమశిక్షణ మరియు స్వయం సమృద్ధి ఉంటేనే జీవితం సుఖంగా సాగుతుంది.

మనం వివేకం, క్రమశిక్షణ మరియు స్వావలంబనను అవలంబిస్తే, మనం జీవితంలో ఆనందం మరియు గౌరవం రెండింటినీ కనుగొనవచ్చు. ఆచార్య చాణక్యుని ఈ విధానాలు శతాబ్దాల నాటివి, కానీ నేటికీ సమానంగా సరైనవి మరియు ఉపయోగకరమైనవి. నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More