న్యూమరాలజీ ప్రకారం మీ లక్కీ ఏజ్ ఇదే.. ఈ వయసులో మీ అదృష్టం మారిపోతుంది!

Birth Date Numerology : న్యూమరాలజీ ప్రకారం.. అదృష్టం పూర్తిగా తోడైతే మీరు ఏ వయసులో అపారమైన సంపదకు యజమాని కావచ్చు. మీ పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో సంపద వస్తుంది.

Published on: May 19, 2026, 18:13:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి వ్యక్తి జీవితంలో విజయం, మంచి పేరు, అపారమైన సంపదను కావాలని కోరుకుంటాడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేక సమయం వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి ప్రతి అడుగులోనూ అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుందని అంటారు. మీ పుట్టిన తేదీ సహాయంతో మీరు ఏ వయస్సులో విజయం సాధించి, అపారమైన సంపదను పొందుతారో తెలుసుకోవచ్చు.

న్యూమరాలజీ
న్యూమరాలజీ

నెంబర్ 1

మీ పుట్టిన తేదీ ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీలలో ఉంటే, మీ సంఖ్య 1 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 సంఖ్య గల వ్యక్తులకు 22 సంవత్సరాల వయస్సు చాలా ప్రత్యేకమైనది. ఈ వయస్సులో 1 సంఖ్య గల వ్యక్తులు విజయాన్ని సాధించడానికి కొత్త మార్గాలను చూస్తారని, అపారమైన సంపదను పొందుతారని చెబుతారు.

నెంబర్ 2

ఏ నెలలోనైనా 2, 11, 20, 21వ తేదీలలో జన్మించిన వారికి 2 సంఖ్య ఉంటుంది. 2 సంఖ్య గల వారికి 24వ సంవత్సరం కూడా చాలా శుభప్రదమైనదిగా అంటారు. ఈ సమయంలో మీరు మీ వృత్తి, ఆర్థిక పరిస్థితిలో చాలా మెరుగుదలను అనుభవిస్తారు. అదేవిధంగా ఈ వయస్సులో 2 సంఖ్య గల వారి బ్యాంకు బ్యాలెన్స్ చాలా పెరుగుతుంది.

నెంబర్ 3

మీరు ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీన జన్మించినట్లయితే, మీ జన్మ సంఖ్య 3 అవుతుంది. 3 సంఖ్య గల వారికి 32 సంవత్సరాల వయస్సు చాలా అదృష్టకరంగా ఉంటుంది. 32 సంవత్సరాల వయస్సులో 3 సంఖ్య గల వారు తమ కష్టానికి చాలా మంచి ఫలితాలను పొందుతారు.

నెంబర్ 4

ఏ నెలలోనైనా 4వ, 13వ, 22వ లేదా 31వ తేదీన జన్మించిన వారి జన్మ సంఖ్య 4. జన్మ సంఖ్య 4 ఉన్న వ్యక్తులకు 36, 42 సంవత్సరాల వయస్సు అత్యంత శుభప్రదమైనదని చెబుతారు. ఈ కాలంలో, జన్మ సంఖ్య 4 ఉన్న వ్యక్తులు అధిక ఆర్థిక లాభాలను పొందుతారు. ఆస్తికి సంబంధించిన మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.

నెంబర్ 5

మీరు ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీన జన్మించినట్లయితే.. మీ జన్మ సంఖ్య 5 అవుతుంది. 5 సంఖ్య గల వ్యక్తులకు 32 ఏళ్ల వయస్సు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 32 ఏళ్ల వయస్సులో 5 సంఖ్య గల వ్యక్తులు అదృష్టం పూర్తి మద్దతును పొందుతారని, ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుందని చెబుతారు.

నెంబర్ 6

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి 6 సంఖ్య ఉంటుంది. 6 సంఖ్య గల వ్యక్తులు 25వ సంవత్సరంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. చాలా పురోగతి సాధించడానికి మంచి అవకాశాలు కూడా పొందుతారు. ఈ వయస్సులో 6 సంఖ్య గల వ్యక్తులు తమ జీవితంలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు.

నెంబర్ 7

7, 16, 25వ తేదీలలో జన్మించిన వారి జన్మ సంఖ్య 7గా ఉంటుంది. 7 సంఖ్య గల వారికి 38వ, 34వ సంవత్సరాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ కాలంలో 7 సంఖ్య గలవారు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

నెంబర్ 8

8, 17, 26 తేదీలలో జన్మించిన వారికి 8 సంఖ్య ఉంటుంది. 8 సంఖ్య గల వారికి 36, 42 సంవత్సరాల వయస్సు చాలా మంచిదని అంటారు. ఈ కాలంలో మీ ప్రతి అడుగులో అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంలో 8 సంఖ్య గల వారికి పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

నెంబర్ 9

9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి 9 సంఖ్య ఉంటుంది. 9 సంఖ్య గల వారికి 28వ సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతారు. ఈ వయస్సులో 9 సంఖ్య గల వారికి మంచి పేరు, గౌరవం, కీర్తి, విజయం కూడా లభిస్తాయి.

గమనిక : ఇది కేవలం నమ్మకాల ఆధారపడిన కథనం. ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More