ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
పురుషోత్తమ మాసంగా పిలిచే అధిక మాసంలో 33 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత, గోవర్ధన ధరమ్ శ్లోక విశిష్టత మరియు అనంతమైన ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక మార్గాల గురించి పూర్తి వివరాలు. ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు సకల పాపాలు కూడా తొలగిపోతాయి.
ఇది జ్యేష్ఠ అధికమాసం అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అధిక మాసం చాలా ప్రత్యేకమైనది. అధిక మాసాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే చాలా విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అధిక మాసం అనేది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. సూర్యమానానికి, చంద్రమానానికి మధ్య వ్యత్యాసాన్ని సరి చేస్తూ వచ్చే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారు.

ఈ నెలలో ఏ దైవకార్యమైనా చేసినట్లయితే అనంతమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే అధికమాసంలో 33 ప్రదక్షిణలు చేయడం, 33 అరిసెలను చేయడం, 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, 33 దీపాలను వెలిగించడం ఇలా చేస్తూ ఉంటారు.
ఈ సంఖ్య వెనుక రహస్యం
ఈ సృష్టిని నడిపించే 33 రకాల శక్తులను ఉద్దేశించే ఇలా 33 సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇవన్నీ చేసినంత ఫలితం రావాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని 33 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క శ్లోకం వీటన్నింటినీ పాటించిన ఫలితాన్ని పొందవచ్చు.
“గోవర్ధనం ధరమ్ వందే, గోపాలం గోపరూపిణం।
గోకులోత్సవ మీశానం, గోవిందం గోపికాప్రియం॥”
గోవర్ధనం ధరమ్ వందే అంటే గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిన ఆ పరమాత్ముడికి నేను నమస్కారం చేస్తున్నాను.
గోపాలం గోపరూపిణం అంటే గోవులను కాపాడే గోపాలుడిగా, సామాన్య గోపబాలుడు రూపంలో ఉన్న ఆ దైవానికి నేను నమస్కారం చేస్తున్నాను.
గోకులోత్సవ మీశానం అంటే గోకులంలో పండగ వాతావరణం నింపిన ఈశ్వరుడికి ప్రణామం.
గోవిందం గోపికాప్రియం అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ గోవిందుకి, గోపికల మనసు గెలుచుకున్న ఆ కృష్ణుడికి నా శరణాగతి అని ఈ శ్లోకానికి అర్థం.
రోజూ ఇలా చదువుకోండి చాలు
ఈ విశేషమైన పురుషోత్తమ మాసంలో ఈ శ్లోకాన్ని ప్రతి రోజూ 33 సార్లు చదువుకున్నట్లయితే, 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం, 33 దీపాలు వెలిగించినంత ఫలితం, 33 అరిసెలను కాంస్యపాత్రలో ఉంచి దానం చేసినంత ఫలితం దక్కుతుందని నమ్మకం. సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.
గాయత్రీ మంత్రం కూడా
అలాగే ఈ అధికమాసంలో 33 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కనుక వీలయితే రోజూ గాయత్రి మంత్రం కూడా చదువుకోండి. మంచి ఫలితాలను చూడచ్చు.
ఎక్కువ ఫలితం
సాధారణ నెలల కంటే అధిక మాసంలో చేసే విష్ణు నామ స్మరణకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. 33 సంఖ్యతో ముడిపడి ఉన్న నియమాలను పాటిస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగా భక్తితో స్వామిని ఆరాధిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో భాగవత పారాయణం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


