ఆచార్య చాణక్యుడి ఆర్థిక సూత్రాలు: డబ్బొస్తే సరిపోదు.. ఈ 3 విషయాలు తెలిస్తేనే అసలైన ధనవంతులు!
ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు.. ఆ సంపదన ఎలా కాపాడుకోవాలో ఆచార్య చాణక్యుడు చెప్పిన అద్భుతమైన ఆర్థిక సూత్రాలు, పొదుపు రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడిని అత్యున్నత దూరదృష్టి గల ఆర్థికవేత్తగా, తత్వవేత్తగా కొలుస్తారు. ఆయన అందించిన నీతి శాస్త్రం కేవలం శ్లోకాల సంకలనం మాత్రమే కాదు.. మనిషి దైనందిన జీవితాన్ని, ఆర్థిక ప్రణాళికను సరిదిద్దే అద్భుతమైన మార్గదర్శి. సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా మార్చడంలో చాణక్యుడి వ్యూహాత్మక ఆలోచనే ప్రధాన పాత్ర పోషించింది. నేటి ఆధునిక కాలంలోనూ ఆయన చెప్పిన సూత్రాలు మనిషిని విజయపథంలో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా సంపాదన, డబ్బు నిర్వహణపై చాణక్యుడు చెప్పిన సత్యాలు ఎప్పటికీ శిరోధార్యమే.

డబ్బు మాత్రమే మనిషికి అసలైన మిత్రుడు
చాణక్య నీతి ప్రకారం, కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా ఆదుకునేది ధనమే. అయితే కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే సరిపోదని, దానిని సరిగ్గా నిర్వహించడం కూడా రావాలని చాణక్యుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వివరిస్తూ ఆయన ఒక సుప్రసిద్ధ శ్లోకాన్ని అందించారు.
చాణక్య చెప్పిన ఒక శ్లోకం ప్రకారం చూస్తే.. సంపాదించిన ధనాన్ని మొదట కాపాడుకోవాలి. ఆ తర్వాత ఆదా చేసిన ధనాన్ని సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసుకోవాలి. అలా పెరిగిన సంపదను సత్కార్యాలకు, దాన ధర్మాలకు వినియోగించాలి. ఇదే సరైన ధన నిర్వహణ విధానమని చాణక్యుడు పేర్కొన్నారు.
డబ్బును కాపాడుకోవడం ఎలా?
అనియంత్రిత ఖర్చులతో సంపాదనను కోల్పోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపద సమయంలో కేవలం మనం పొదుపు చేసిన ధనమే నిజమైన స్నేహితుడిగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. సంపాదనకు మించి ఖర్చు చేసేవారు త్వరలోనే దారిద్య్రం బారిన పడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ధనానికి ఉండే గతులు ఇవే
చాణక్యుడి విశ్లేషణ ప్రకారం ధనానికి మూడు గతులు మాత్రమే ఉంటాయి. డబ్బును సరిగ్గా ఖర్చు పెట్టాలి. అలాగే డబ్బును దానం చెయ్యాలి. ఒకవేళ సంపాదించిన ధనాన్ని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే, అది వాటంతట అవే కరిగిపోయి. డబ్బు అంతా కూడా సర్వనాశనం అవుతుంది. అలాగే వ్యక్తిగత ఆర్థిక స్థితిగతులను ఎప్పుడూ నలుగురి ముందు బహిర్గతం చేయకూడదు. ఆదాయం, పొదుపు, నష్టాల గురించి అందరితో చర్చిస్తే ఇతరులు దానివల్ల అనుచిత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కనుక ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచడమే ఉత్తమం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


