పదేళ్ళ తర్వాత ఏర్పడిన శతంక యోగం, ఐదు రాశుల వారి జీవితంలో వెలుగులు.. ఈరోజు నుంచి డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో!

ప్రతి గ్రహం కూడా ఆ నిర్దిష్ట కాలం తర్వాత ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 11 అంటే ఈరోజు ఉదయం 6:49కి శుక్రుడు, గురువు 100 డిగ్రీల కోణంలో సంచారం చేస్తున్నారు. దీంతో శతంక రాజయోగం ఏర్పడింది. మరి ఏ రాశుల వారికి ఈ శతంక యోగం బాగా కలిసి వస్తుంది?

Published on: Nov 11, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ప్రతి గ్రహం కూడా ఆ నిర్దిష్ట కాలం తర్వాత ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 11 అంటే ఈరోజు ఉదయం 6:49కి శుక్రుడు, గురువు 100 డిగ్రీల కోణంలో సంచారం చేస్తున్నారు. దీంతో శతంక రాజయోగం ఏర్పడింది.

పదేళ్ల తర్వాత ఏర్పడిన శతంక యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)
పదేళ్ల తర్వాత ఏర్పడిన శతంక యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)

రాజయోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తోంది. 12 రాశుల వారి జీవితంలో మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. వ్యాపారులకూ ఇది అద్భుత సమయం. మరి ఏ రాశుల వారికి ఈ శతంక యోగం బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

పదేళ్ల తర్వాత ఏర్పడిన శతంక యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు:

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గురు, శుక్రుల ప్రభావంతో ఏర్పడిన ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. వ్యాపారులు అద్భుతమైన మార్పులను చూస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఒత్తిడి తగ్గి విజయాలను అందుకుంటారు.

2.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. శుక్రుడు, గురువు అనుగ్రహంతో కెరీర్‌లో పురోగతి ఉంటుంది. అప్పులు తీరుతాయి. ఆర్థికపరంగా బావుంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలను చూస్తారు. ఉద్యోగులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. పాత ప్రాజెక్టుల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త నైపుణ్యాలను పెంచుకోవచ్చు.

4.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రాజయోగం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. పెండింగ్లో ఉన్న టాస్కులను పూర్తిచేస్తారు. కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వ్యాపారులకూ ఇది అద్భుత సమయం.

5.మీన రాశి

మీన రాశి వారికి ఈ యోగం అద్భుతంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. కొత్త సవాళ్లను ఈజీగా అంగీకరిస్తారు. కళాత్మక రంగాల్లో విజయాలను అందుకుంటారు.

News/Rasi Phalalu/పదేళ్ళ తర్వాత ఏర్పడిన శతంక యోగం, ఐదు రాశుల వారి జీవితంలో వెలుగులు.. ఈరోజు నుంచి డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో!
News/Rasi Phalalu/పదేళ్ళ తర్వాత ఏర్పడిన శతంక యోగం, ఐదు రాశుల వారి జీవితంలో వెలుగులు.. ఈరోజు నుంచి డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో!